Summer Foods - Pregnant | గర్భిణీ స్త్రీలు ఈ వేసవిలో తప్పకుండా తినాల్సిన 5 ఆహారాలు!
Summer Foods For Pregnant Women: ఎండాకాలంలో గర్భిణీ స్త్రీలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇదే సీజన్ లో వారికి అవసరమయ్యే ఆరోగ్యకరమైన, పండ్లు కూరగాయలు విరివిగా లభిస్తాయి. వీటిని తప్పకుండా తినాలి.
Summer - Pregnancy: వేసవికాలంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలు ఇబ్బందిపెడతాయి ఈ సీజన్ గర్భిణీ స్త్రీలకు మరింత కఠినంగా అనిపించవచ్చు. తలనొప్పి, మైకము, డీహైడ్రేషన్ తో పాటు కడుపులో సంకోచాలు కలగవచ్చు. ఒకవైపు వాతావరణంలోని వేడి, మరొకవైపు గర్భాన్ని మోయడం, గర్భంలోపల సాధారణంగా ఉండే వేడి వాతావరణం వారికి చికాకును కలిగిస్తుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకోవడం వలన ఈ కాలాన్ని వారు అధిగమించవచ్చు.
అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే, గర్భధారణకు అవసరమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు ఈ వేసవి కాలంలోనే విరివిగా లభిస్తాయి. వారు హైడ్రేటెడ్ గా, రిఫ్రెషింగ్ గా ఉండటానికి ఈ సీజన్ లో లభించే పండ్లు ఎక్కువగా తినాలి. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.
Summer Foods For Pregnant Women- గర్భిణీ స్త్రీలకు వేసవిలో ఉత్తమ ఆహారాలు
గర్భిణీ స్త్రీలు ఈ వేసవి కాలంలో మిస్ చేయకుండా తినాల్సిన ఐదు ఆహారాలు ఇక్కడ తెలుసుకోండి.
పుచ్చకాయ
పుచ్చకాయ వేసవిలో లభించే రిఫ్రెషింగ్ పండు, పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది, ఇది వేసవి వేడిలో గర్భిణీలకు మంచి హైడ్రేషన్ అందిస్తుంది. అదనంగా ఈ పండులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి గర్భిణీలకు చాలా అవసరం. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. గర్భిణీలు పుచ్చకాయను చిరుతిండిగా ఆస్వాదించవచ్చు లేదా సలాడ్‌ల రూపంలో తింటూ ఆనందించవచ్చు.
మామిడిపండ్లు
మామిడిపండ్లు వేసవికాలంలో లభించే ఒక రుచికరమైన, పోషకభరితమైన పండు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు శిశువులో కళ్ల అభివృద్ధికి, రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. మామిడి పండ్లలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాబోయే తల్లులు మామిడి పండ్లను మితంగా ఆస్వాదించవచ్చు. స్మూతీస్‌లో కలుపుకోవచ్చు, పెరుగు లేదా ఓట్‌మీల్‌కు టాపింగ్‌గా ఉపయోగించవచ్చు.
టమోటాలు
ఈ వేసవిలో గర్భిణీ స్త్రీలు మిస్ చేయకుండా తినాల్సిన వాటిలో టొమాటోలు కూడా ఉంటాయి. టొమాటోలు ఎంతో రుచికరమైనవి, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శిశువు రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి అవసరం. టొమాటోలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది. తల్లి కాబోయేవారు టమోటాలు, మెంతికూర కలిపికూరగా చేసుకొని తినవచ్చు, సలాడ్‌లు, శాండ్‌విచ్‌లకు కలుపుకోవచ్చు లేదా సూప్‌ల రూపంలో తాగవచ్చు.
పెరుగు
పెరుగు లేదా యోగర్ట్ కాల్షియం వంటి పోషకాలనికి అద్భుతమైన మూలం, ఇది శిశువులో ఎముకలు, దంతాల పెరుగుదల కీలకమైన మినరల్. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తల్లి కాబోయే వారు ఈ వేసవి కాలంలో పెరుగును వద్దనకుండా తినండి.
ఆకుకూరలు
పాలకూర, మెంతికూర, కాలే, అరగుల వంటి ఆకు కూరలు గర్భిణీలు తప్పకుండా తినాలి. వీటిలో ఫోలేట్, ఐరన్, విటమిన్ K వంటి అవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. ఈ పోషకాలు శిశువు పెరుగుదల, అభివృద్ధికి చాలా అవసరం. ఆకు కూరల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. తల్లి కాబోయేవారు ఆకుకూరలను ఎక్కువగా తినాలి.
మరోవైపు.. కాఫీ టీలు, సోడా కలిగిన పానీయాలు, చక్కెర కలిగిన పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, మద్యపానం, ధూమపానం వంటివి నివారించాలి.
సంబంధిత కథనం
టాపిక్