Onion Tea Health Benefits । ఉల్లిపాయ టీ.. గుండెకు మంచిది, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా!-steps to make onion tea know amazing health benefits of having this warm beverage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Steps To Make Onion Tea, Know Amazing Health Benefits Of Having This Warm Beverage

Onion Tea Health Benefits । ఉల్లిపాయ టీ.. గుండెకు మంచిది, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా!

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 12:28 PM IST

Onion Tea Health Benefits: ఉల్లిపాయ టీ తాగటం వలన ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా టీ చేయాలి, ఎలా తాగాలి ఇక్కడ తెలుసుకోండి.

Onion Tea Health Benefits
Onion Tea Health Benefits (istock)

ఈరోజుల్లో చాలా మందికి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా సాధారణమైంది. జీవనశైలి ఆరోగ్యకరంగా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఆహారం విషయంలో చాలా మంది రుచికే ప్రాధాన్యతనిస్తారు, ఆరోగ్యాన్ని, పోషక విలువలను గాలికొదిలేస్తారు. నూనె పదార్థాలు అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య మొదలవుతుంది. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. పరిస్థితి చేయిదాటకముందే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహార పానీయాలను తీసుకోవాలి.

అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉల్లిపాయ టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ చాయ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది మీరు రెగ్యులర్ గా తీసుకునే టీ కంటే చాలా భిన్నమైది. పుదీనా, చమోమిలే, మందార వంటి కొన్ని ప్రత్యేక రకాల టీలను సేవించి ఉంటారు, కానీ ఉల్లిపాయ టీ చాలా అరుదు. ఇది రుచిలో కాస్త వెగటుగా ఉంటుంది. అయినప్పటికీ, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌ను తగ్గించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉండటమే ఇందుకు కారణం.

Onion Tea Health Benefits- ఉల్లిపాయ టీ ఆరోగ్య ప్రయోజనాలు

ఉల్లిపాయ టీ తాగటం వలన ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

ఉల్లిపాయ టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరంలో చెడు లిపిడ్‌లు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి.

రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఉల్లిపాయల్లో కొన్ని ఫ్లేవనాయిడ్లు , పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండూ మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ నష్టం నుండి రక్త నాళాల గోడలను రక్షించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ విధంగా, ఉల్లిపాయ టీ అధిక కొలెస్ట్రాల్, బలహీనమైన రక్త ప్రసరణ సమస్యను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండెకు మేలు

ఉల్లిపాయ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, వాటి సమ్మేళనాలు వాపుతో పోరాడి ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాయి. అలాగే, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక రక్తపోటును తగ్గించి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

How To Make Onion Tea- ఉల్లిపాయ టీ ఎలా తయారు చేయాలి

ఉల్లిపాయ టీ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక ఉల్లిపాయను కోసి 2 కప్పుల నీళ్లలో వేసి మరిగించాలి. గిన్నెలోని నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. మీరు కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ నీటిని ఒక కప్పులోకి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. దీనిని ప్రయత్నించే ముందు వైద్య నిపుణుల సలహా స్వీకరించండి.

WhatsApp channel