తెలుగు న్యూస్ / ఫోటో /
Fat Burning Soups । ఈ సూప్‌లు తాగండి.. సునాయాసంగా చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోండి!
(1 / 5)
వెజిటబుల్ సూప్‌లు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి, వీటితో కొవ్వు పెరగపోగా కరుగుతుంది. ఆ సూప్స్ ఏవో , ఎలా తయారు చేసుకోవాలో చూడండి.
(2 / 5)
వెజిటబుల్ టొమాటో సూప్ రెసిపీ: ఈ సూప్ తయారీకి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ. అన్నీ కలిపి 200 గ్రాములు ఉండాలి, వీటిని ముక్కలుగా కోసుకొని, ఆపై మూడు టొమాటోల రసాన్ని తీసుకుని వడకట్టి ప్రెజర్ పాన్‌లో వేయాలి. ఆపై వెల్లుల్లి, లవంగాలు, సెలెరీతో వేసుకోవాలి. అవసరం మేరకు ఉప్పు, మిరియాల పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. రాత్రి భోజనానికి బదులు వారానికి రెండు సార్లు ఈ సూప్ తింటే బరువు పెరగరు. అనవసరమైన కొవ్వు కూడా తగ్గుతుంది.
(3 / 5)
గుమ్మడికాయ పాలకూర సూప్ రెసిపీ: పావు కిలో బూడిద గుమ్మడికాయ తొక్క తీసి, గింజలు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఒక ఆపిల్ పీల్, ఆపిల్ ముక్క , పాలకూర ఆకులు, చిన్న అల్లం ముక్క అన్నీ వేసి గ్రైండర్ లో బాగా రుబ్బుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, తేనె, చాట్ మసాలా పొడి వేసి తాగండి. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. చెడు కొవ్వు నిల్వ ఉండదు.
(4 / 5)
సామై హాఫ్ వెజ్జీ సూప్ రెసిపీ: పాన్‌లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సామై రైస్ లేదా సామల బియ్యం వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి చిన్న ప్రెషర్ పాట్ లో వేసి రెండు టంబ్లర్ల నీళ్లు పోసి 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. ఆపై సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇందులో ఉప్పు, తెల్ల మిరియాలు వేసుకొని తాగవచ్చు. అవసరమైతే ఆకుకూరలు, బఠానీలు కలిపి కూడా ఉడికించుకోవచ్చు. ఈ సూప్ జీర్ణక్రియకు మంచిది, బరువు ఈజీగా తగ్గుతారు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు