Chicken Vegetable Soup Recipe : వెజిటబుల్స్‌తో చికెన్.. కలిపి సూప్ చేసేయండి..
Chicken Vegetable Soup Recipe : చలికాలం మొదలైపోయిందనే చెప్పాలి. వర్షాలతో సహా చలి కూడా పెరిగిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఉదయం చాలా లేజీగా ఉంటుంది. దానిని ఫుల్ ఎనర్జీగా మార్చేయాలనుకుంటే.. వెచ్చని సూప్‌ని మనం బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవాల్సిందే. అది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తూ.. మీ చలిని వదిలించేస్తుంది.
Chicken Vegetable Soup Recipe : ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా చికెన్ వెజిటబుల్ సూప్ తీసుకుంటే.. వెచ్చని ఫీలింగ్ కలుగుతుంది. పైగా దానిలో చికెన్, వెజిటెబుల్స్ మీకు శక్తిని అందిస్తాయి. జలుపు, దగ్గు వంటివాటినుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మీరు సూప్‌లకు దూరంగా ఉండకండి. మరి చికెన్ వెజిటబుల్ సూప్‌ని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సినవి
* చికెన్ - 1 కప్పు (చిన్న ముక్కలు)
* క్యారెట్ - 1 (తరిగినది)
* బఠానీలు - అర కప్పు
* మొక్కజొన్నలు - అరకప్పు
* ఒరెగానో - రుచికి సరిపడా
* బ్లాక్ పెప్పర్ - రుచికి తగినంత
* కొత్తిమీర - గార్నిష్ చేయడానికి
* ఉప్పు - తగినంత
తయారీ విధానం
చికెన్ వెజిటబుల్ సూప్ కోసం ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో.. చికెన్ వేసి.. కొద్దిగా ఉప్పు వేసి.. మెత్తబడే వరకు ఉడికించాలి. అలా చికెన్ ఉడకబెట్టిన పులుసును సేవ్ చేయండి. ఇప్పుడు పాన్ తీసుకుని.. దానిలో చికెన్ ఉడకబెట్టిన పులుసు, కూరగాయలు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఒరేగానో వేయండి.
కూరగాయలు మెత్తబడే వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు చికెన్ వేసి.. మరో రెండు నిమిషాలు ఉడికించండి. చివరిగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి.. వేడి వేడిగా తాగేయండి. ఇది మీ చలిని దూరం చేసి.. మీకు వెచ్చని ఫీల్ ఇస్తూ.. మీ రోజును ఎనర్జీగా ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది.
సంబంధిత కథనం