Breakfast Recipes: ప్రోటీన్స్‌తో నిండిన బ్రేక్‌ఫాస్ట్.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్
Breakfast Recipes : బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. టేస్ట్‌కి బాగుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. అయితే ఈ బాదంతోనే మన బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే.. ఇంకా హెల్తీగా మన డేని స్టార్ట్ చేసినట్టే. మీరు కూడా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం యాడ్ చేయాలనుకుంటే.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్ గురించి తెలుసుకోవాల్సిందే.. చేసుకుని తినాల్సిందే.
Breakfast Recipes : ఉదయాన్నే ప్రోటీన్‌తో నిండిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే.. మనకి ఎనర్జీబాగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. పైగా అది బాదంతో అయితే ఇంక చెప్పనవసరంలేదు. బాదం హెల్త్‌కి చాలా మంచిది. పైగా ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా సూప్ లాగిస్తే.. ఆహా ఆ వెచ్చని ఫీల్ గురించి మాటల్లో చెప్పలేము. మీరు కూడా ఇలాంటి అనుభూతిని చెందాలి అనుకుంటే.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్‌ని తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* వెజిటబుల్ స్టాక్ - 800 Ml
* మిల్క్ - 200 ml
* బాదం (పొడి) - 100 gms
* వెన్న - 50 gms
* మొక్కజొన్న పిండి - 50 gms
* ఉప్పు - రుచికి తగినంత
* మిరియాలు - చిటికెడు
* జాజికాయ - కొంచెం
* బాదం ఎసెన్స్ - 2-3 చుక్కలు
* బాదం - 3 ముక్కలు చేసుకోవాలి
క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్ తయారీ విధానం
ఒక పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై ఉంచాలి. ఇప్పుడు ఈ పాన్‌లో వెన్న వేసి.. తక్కువ వేడి మీద కరిగించాలి. దానిలో మొక్కజొన్న పిండి, పాలు కలిపిన మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. దానిలో బాదం పొడి, వెజిటబుల్ స్టాక్‌ను వేసి బాగా కలపాలి. దానిలో ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ, బాదం ఎసెన్స్ వేసి బాగా కలపాలి. అంతే క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్ రెడీ. వేడి వేడిగా బాదం ముక్కలతో అలంకరించి దానిని సర్వ్ చేయాలి.
సంబంధిత కథనం