Sugarcane for beauty: చెరకు రసాన్ని జుట్టుకు, చర్మానికి ఇలా వాడండి.. బోలెడు లాభాలు..-sugarcane for hair and skin and its different benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sugarcane For Hair And Skin And Its Different Benefits

Sugarcane for beauty: చెరకు రసాన్ని జుట్టుకు, చర్మానికి ఇలా వాడండి.. బోలెడు లాభాలు..

Koutik Pranaya Sree HT Telugu
May 29, 2023 12:51 PM IST

Sugarcane for beauty: చర్మం, కేశ సంరక్షణలో చెరకు రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. అలాగే చెరకులో ఉండే పోషకాలు, లాభాలేంటో కూడా చూసేయండి.

చర్మ, కేశ సంరక్షణకు చెరకు రసం
చర్మ, కేశ సంరక్షణకు చెరకు రసం (freepik)

చెరకు రసం తాగుతున్నారా? అయితే తాగడానికే కాదు దాన్ని అందం కోసం కూడా వాడేయొచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం దీన్ని ఉపయోగించొచ్చు. వేసవిలో ఎక్కువగా దొరికే ఈ రసం వల్ల వేసవిలో వచ్చే చర్మ, జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. దాని లాభాలు, చర్మానికి, జుట్టుకు ఎలా వాడాలో తెలుసుకోండి.

1. యాక్నె:

చెరుకులో ఉండే యాంటీమ్రైక్రోబయల్ లక్షణాల వల్ల యాక్నెకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీంట్లో ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా పేరుకోకుండా కాపాడతాయి. జిడ్డు తొలగిస్తాయి. చర్మం రంధ్రాలు తెరుచుకునేలా చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య తగ్గిస్తాయి. తరచూ వాడటం వల్ల యాక్నెవల్ల వచ్చిన గుంతలు, మచ్చలు కూడా తగ్గుతాయి.

2. తేమగా ఉంచడంలో:

ఇందులో గ్లైకోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. చర్మం తేమను కాపాడి పొడిబారకుండా చేస్తుంది. చర్మం పొలుసులుగా ఊడటం, మచ్చల సమస్య చెరకు రసం తరచూ వాడితే తగ్గిపోతాయి.

3. వయస్సుతో వచ్చే లక్షణాలు తగ్గిస్తుంది:

దీంట్లో ప్రొటీన్, మినరళ్లు, ఐరన్, జింక్, పొటాషియం ఉంటాయి. యాంటీ ఆక్సిండెట్లు, ఫ్లవనాయిడ్లు కూడా ఎక్కువే. ఇవి చర్మం ఫ్రీ రాడికల్స్ నుంచి దెబ్బతినకుండా కాపాడతాయి. చెరకు రసంలో విటమిన్ ఏ, సి కూడా ఉంటాయి. చర్మం మీద ముడతలు, సన్నం గీతలు తగ్గించి చర్మాన్ని యవ్వనంగా చేస్తాయి.

4. మృతకణాలు తొలగిస్తుంది:

చెరకు లో ఉంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ల వల్ల చర్మం మీదున్న మృతకణాలు తొలిగిపోతాయి. తాజా చర్మం సొంతమవుతుంది.

5. గాయాలు తగ్గించడంలో:

దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గాయాలు తొందరగా మానేలా చేస్తుంది. చర్మం దద్దుర్లు, ఎర్రగా అయితే కాస్త చెరకు రసం రాసి చూడండి. తొందరగా మానిపోతాయి.

6. జుట్టు ఆరోగ్యం:

చెరకు రసం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు తగ్గుతుంది. దీంట్లో ఉండే అమైనో యాసిడ్ల వల్ల జుట్టు పెరగడానికి కూడా సాయపడతాయి. మాడు పీహెచ్ స్థాయుల్ని కాపాడతాయి. మాడు సమస్యలు తగ్గిస్తాయి.

చర్మానికి చెరకు రసం ఎలా వాడాలంటే:

  1. స్కిన్ టోనర్: ఒక దూది ఉండను చెరకు రసంలో ముంచి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల చర్మరంధ్రాలు బిగుతుగా మారతాయి. చర్మం పీహెచ్ నియంత్రిస్తుంది.
  2. ఫేస్ మాస్క్: చెరకు రసాన్ని ఒక చెంచా నిమ్మరసం, చెంచా తేనె కలిపి రాసుకోవాలి. ముఖానికి రాసుకుని పావుగంటయ్యాక కడిగేసుకోవాలి. చర్మం తేమగా మారుతుంది.

జుట్టుకు చెరకు రసం ఎలా వాడాలంటే:

  1. మాడు మర్దనా: చెరకు రసంలో కొన్ని చుక్కల కొబ్బరి లేదా బాదాం నూనె కలపాలి. దీంతో మాడుకు బాగా మర్దనా చేసి తలస్నానం చేయాలి. రక్త ప్రసరణ పెరిగి జుట్టు ఆరోగ్యంగా, రాలకుండా ఉంటుంది.
  2. జుట్టు కడగడం: తలస్నానం చేసిన తరువాత తలమీద చెరకు రసం పోసి మర్దనా చేయాలి. ఒక రెండు నిమిషాలుంచి కడిగేయాలి. ఇది కండీషనర్ లాగా పనిచేస్తుంది. జుట్టు, మాడు ఆరోగ్యం కాపాడుతుంది.

WhatsApp channel