Aloe Vera for Weight loss । సహజంగా, సులభంగా బరువు తగ్గలా? కలబందను ఇలా తీసుకోండి!-amazing aloe vera juices recipes to lose weight easily and naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloe Vera For Weight Loss । సహజంగా, సులభంగా బరువు తగ్గలా? కలబందను ఇలా తీసుకోండి!

Aloe Vera for Weight loss । సహజంగా, సులభంగా బరువు తగ్గలా? కలబందను ఇలా తీసుకోండి!

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 04:21 PM IST

Aloe Vera for Weight loss: కొవ్వును కరిగించడంలో అలోవెరా జెల్ అద్భుతంగా సహాయపడుతుంది. బరువు తగ్గటానికి కలబంద జెల్ ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

Aloe Vera for Weight loss
Aloe Vera for Weight loss (istock)

Weight Loss Juices: చర్మ సంరక్షణకు సంబంధించిన విషయంలో కలబందకు చాలా ప్రధాన్యత ఉంటుంది. అనేక స్కిన్ కేర్ ఉత్పత్తులలో కలబందను వినియోగించినట్లు చెబుతారు. అయితే కలబంద రసం కేవలం చర్మ సంరక్షణ కోసం మాత్రమే కాదు, దీనితో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కలబంద అనేక రకాలుగా పని చేస్తుంది. కొవ్వును కరిగించడంలో అలోవెరా జెల్ అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కడుపులో నిల్వ ఉన్న కొవ్వు కణాలను బంధిస్తుంది, వాటిని నీటి సహాయంతో బయటకు పంపివేయడంలో పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా, శరీరంలో హైడ్రేషన్ పెంచడానికి కూడా కలబంద జెల్ పనిచేస్తుంది.

మరి బరువు తగ్గటానికి కలబంద జెల్ (Aloe Vera for Weight loss) ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తున్నారా? కలబంద రసాన్ని నేరుగా తీసుకోవచ్చు. కలబందతో తయారు చేయగల కొన్ని పానీయాల రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం. బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలు ఎప్పుడైనా సేవించవచ్చు.

ఆమ్లా అలోవెరా జ్యూస్

ఉసిరి- అలోవెరా జ్యూస్ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఆమ్లా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది, కలబంద జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఈ రెండింటి కలయిక మీకు వ్యాయామం చేసినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వ్యాయామం చేస్తూ ఈ పానీయం తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. 1 గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉసిరి పొడి లేదా రసం కలపండి, అలాగే తాజాగా అలోవెరా జెల్ కూడా కొద్దిగా కలపండి. మిక్స్ చేసి తాగాలి.

చియా సీడ్స్ అలోవెరా జ్యూస్

కలబంద రసంలో సబ్జా గింజలను కలిపి తాగడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెసిపీని సిద్ధం చేసుకునేందుకు ముందుగా సబ్జా గింజలను కలబంద రసంలో నానబెట్టండి. అరగంట తరువాత, అందులో కొన్ని నీళ్లు, రుచి కోసం తేనె కలపండి. ఈ జ్యూస్ రెగ్యులర్ గా తాగుతుండండి.

యాపిల్ సైడర్ అలోవెరా జ్యూస్

యాపిల్ సైడర్ అలోవెరా జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పానీయం చేయడానికి ఒక గ్లాసులొ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకొని అందులో కొంత నీరు కలపండి, ఆపైన దానికి కలబంద రసం కలపండి. రెండింటినీ కలిపి హాయిగా తాగండి.

ఎలా తాగాలి?

బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం త్రాగడం ఉత్తమం. భోజనానికి ముందు కూడా కలబంద జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ మీ ఆకలిని నియంత్రించడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం