Swimming vs cycling: స్విమ్మింగ్, సైక్లింగ్.. ఏది బెటర్? దేంతో బరువు తగ్గొచ్చు?-swimming vs cycling findout which is a better workout for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Swimming Vs Cycling, Findout Which Is A Better Workout For Weight Loss

Swimming vs cycling: స్విమ్మింగ్, సైక్లింగ్.. ఏది బెటర్? దేంతో బరువు తగ్గొచ్చు?

Koutik Pranaya Sree HT Telugu
May 24, 2023 09:50 AM IST

Swimming vs cycling: స్విమ్మింగ్, సైక్లింగ్ రెండూ శరీరానికి మంచి వ్యాయామం. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు. ఈ రెండింట్లో దేనివల్ల ఎక్కువ లాభాలో తెలుసుకుందామా.

స్విమ్మింగ్ Vs సైక్లింగ్
స్విమ్మింగ్ Vs సైక్లింగ్ (Pixabay)

బరువు తగ్గడానికి, ఫిట్ నెస్ కోసం అందరూ జిమ్ వెళ్లడానికి ఇష్టపడరు. కొంతమందికి బోరింగ్ అనిపిస్తే, కొంతమందికి మొహమాటం ఉంటుంది. స్విమ్మింగ్, సైక్లింగ్, రాక్ క్లైంబింగ్, స్పోర్ట్స్ ఇలాంటి ఆహ్లాదరమైన అవకాశాలుండగా ఎలాంటి బాధా అక్కర్లేదు. స్విమ్మింగ్, సైక్లింగ్ మంచి ఏరోబిక్ వ్యాయామాలు.

ఈ రెండు మీరు కూడా చేద్దాం అనుకుంటే.. వాటి లాభాలు తెలుసుకోండి.

స్విమ్మింగ్ వల్ల లాభాలు:

స్విమ్మింగ్ చేసేటపుడు శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. కానీ ఇది చేయాలంటే ముందు ట్రైనింగ్ అవసరం. తల కండరాల నుంచి బొటనవెేలు దాకా, భుజాలు, కాళ్లు ఇలా ప్రతి భాగం లోని కండరాలు ఈత కొట్టేటపుడు కదులుతాయి.

ధర విషయానికొస్తే స్విమ్మింగ్ నేర్చుకున్నాక ఖర్చు ఎక్కువ ఉండదు. ఇది మంచి కార్డియో వ్యాయామం. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా దీన్ని చేయొచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు కూడా దీన్ని చేయొచ్చు. ఈత వల్ల కీళ్లు దెబ్బతినవు.

స్విమ్మింగ్ వల్ల నష్టాలు:

స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తే భుజం, మోకాళ్ల దగ్గర గాయాలు అవ్వచ్చు. అలాగే స్విమ్మింగ్ పూల్స్‌లో కొన్ని కెమికల్స్ వాడతారు. వాటివల్ల చర్మం పొడిబారటం, ముక్కులో దురద, కళ్లు ఎరుపెక్కడం లాంటి సమస్యలు రావచ్చు.

సైక్లింగ్ లాభాలు నష్టాలు:

చిన్నతనం నుంచే దాదాపు ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉంటారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ అవసరం దాదాపు పడదు. సైక్లింగ్ కోసం ఇంట్లొ ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటే కాస్త ఖర్చుతో కూడకున్న పనే. ఏ వయసు వాళ్లైనా సైక్లింగ్ చేయొచ్చు. ఏదైనా గాయాలు ఉంటే మాత్రం దీని జోలికి పోవద్దు.

సైక్లింగ్ చేసేటపుడు ఎక్కువగా నడుము కింద ఉన్న శరీర భాగాలకే వ్యాయామం జరుగుతుంది. ఎక్కువ సైక్లింగ్ చేస్తే మోకాల కండరాలు పట్టేసే అవకాశం ఉంది.

దేంతో ఎక్కువ బరువు తగ్గొచ్చు?

ఈత, సైక్లింగ్ ఈ రెండింటి వల్ల ఎక్కువ కేలరీలే ఖర్చవుతాయి. కానీ అధ్యయనాల ప్రకారం ఒక గంట స్విమ్మింగ్ చేస్తే సైక్లింగ్ కన్నా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

ఈ రెండు మంచి ఆరోగ్యానికి ఉత్తమ మర్గాలే. స్విమ్మింగ్ వల్ల శరీరం అంతటా వ్యాయమం జరిగితే, సైక్లింగ్ వల్ల కింది భాగాలకే వ్యాయామం జరుగుతుంది. సైక్లింగ్ తో పోలిస్తే స్విమ్మింగ్ లో గాయాలయ్యే అవకాశం తక్కువ. ఇక బరువు తగ్గే విషయంలో కూడా స్విమ్మింగ్ వల్ల ఎక్కువ ఫలితాలుంటాయి. కానీ సైక్లింగ్ చేయడం స్విమ్మింగ్ కన్నా సులువు. కాబట్టి ఈరెండు మంచి మార్గాలే. మీకు నప్పే వ్యాయామం మీరెంచుకోవచ్చు. బరువు, ఆరోగ్యం, ట్రైనింగ్ వసతులు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిర్ణయానికి రండి.

WhatsApp channel

టాపిక్