DIY Aloe Vera Ice । కలబంద ఐస్.. ట్యానింగ్ పోగొట్టడానికి ఇది వెరీ నైస్!-diy aloe vera ice to treat sun burn tanning and other skin problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Diy Aloe Vera Ice To Treat Sun Burn, Tanning And Other Skin Problems

DIY Aloe Vera Ice । కలబంద ఐస్.. ట్యానింగ్ పోగొట్టడానికి ఇది వెరీ నైస్!

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 09:12 AM IST

Aloe Vera Ice For Sun Tanning: సన్ ట్యానింగ్ ను ఎదుర్కొనేందుకు కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. కలబంద ఐస్ ఈ సమస్యకు అద్భుత పరిష్కారం చూపుతుంది. మీ చర్మ సంరక్షణ కోసం కలబందని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

Aloe Vera Ice For Sun Tanning
Aloe Vera Ice For Sun Tanning (istock)

Skin Care in Summer: జూన్ ప్రారంభమైనా కూడా ఎండల తీవ్రత తగ్గటం లేదు, తీక్షణమైన ఎండలకు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, శరీరం వేడెక్కుతూ త్వరగా అలసిపోతుంది, కొన్ని క్షణాల పాటు ఎండలో నిల్చున్నా కూడా చర్మం కాలిన అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ఎండలకు చర్మం గురికావడం వలన అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి, సూర్యరశ్మిలో హానికర అతినీలలోహిత కిరణాలు తీవ్ర నష్టం చేస్తాయి, అనేక అనారోగ్యాలకు కూడా ఇది కారణం అవుతుంది.

ఈ ఎండాకాలంలో చర్మానికి సంబంధించి చాలా మంది ఎదుర్కొనే అతి సాధారణ సమస్య ట్యానింగ్. ఎండకు ప్రజలు త్వరగా నల్లబడతారు, ఎండకు గురైన చర్మం ముదురు రంగులోకి మారిపోతుంది, దుస్తులతో కప్పి ఉన్న ప్రాంతం లేత రంగులో ఉంటుంది. దీనివల్ల శరీరం రంగు ఏకరీతిగా ఉండదు, ఒకచోట తెల్లగా, మరోచోట నల్లగా ప్యాచెస్ అతికించినట్లు ఉంటుంది. ముఖం నల్లబడుతుంది, ఇతర చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. దేనిని నివారించడానికి, మీరు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సన్ ట్యానింగ్ ను ఎదుర్కొనేందుకు కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. కలబంద ఐస్ ఈ సమస్యకు అద్భుత పరిష్కారం చూపుతుంది. మీ చర్మ సంరక్షణ కోసం కలబందని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

కలబందను ఎలా అప్లై చేయాలి?

కలబంద (Aloe vera) జుట్టు, చర్మ సంరక్షణ కోసం అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మంపై సన్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. ఇది సన్ బర్న్, ట్యానింగ్ సమస్యను దూరం చేయడమే కాకుండా చర్మాన్ని తేమగా మారుస్తుంది. మిక్సింగ్ బౌల్‌లో కొద్ది మొత్తంలో అలోవెరా జెల్, లావెండర్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని దానిని ట్యానింగ్ ప్రాంతానికి వర్తించండి. నలుపుదనం తొలగించడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీ.

మరోవైపు ఐసింగ్ (మంచుతో చర్మాన్ని రుద్దడం) మీ చర్మానికి చాలా సహాయపడుతుంది. ఐసింగ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శిస్తుంది, ఇది మంటను తగ్గించడంలో, చర్మ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది, చర్మంపై జిడ్డును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఉబ్బిన కళ్లకు ఐస్ క్యూబ్స్ ఉపయోగించడం వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది.

కలబంద, ఐస్ రెండింటి కలయిక మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. కలబంద ఐస్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

కలబంద ఐస్ ఎలా చేయాలి?

DIY Aloe Vera Ice తయారీకి తాజాగా కత్తిరించిన కలబంద కాండాలను తీసుకుని, వాటిని ఒక సీసా లేదా కూజాలో ఉంచండి. అది పండిపోయి పసుపు ద్రవం బయటకు వచ్చి అలాగే ఉంచండి, ఆ తర్వాత కలబందను బయటకు తీసి ముక్కలుగా చేసి, జెల్‌ను బయటకు తీయండి. ఇప్పుడు, జెల్‌ను బ్లెండర్‌లో బాగా బ్లెండ్ చేయాలి. మెత్తగా బ్లెండ్ చేసిన కలబంద జెల్‌ను ఒక కంటైనర్ లో తీసుకొని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి. అలోవెరా ఐస్ జెల్ తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం గడ్డకట్టిన కలబంద జెల్‌ను మీ ముఖంపై వర్తించుకోండి, చర్మంలోపలి వరకు వెళ్లేలా బాగా రాయండి. శీతల ప్రభావం, కలబందలోని గుణాలు మీ చర్మంపై మ్యాజిక్ చేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం