Onion Juice for Hair । ఉల్లిరసాన్ని జుట్టు వర్తించే సరైన విధానం ఇదీ.. ప్రయోజనాలు ఇవే!-know the right way of using sulphur rich onion juice for hair growth hair fall treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion Juice For Hair । ఉల్లిరసాన్ని జుట్టు వర్తించే సరైన విధానం ఇదీ.. ప్రయోజనాలు ఇవే!

Onion Juice for Hair । ఉల్లిరసాన్ని జుట్టు వర్తించే సరైన విధానం ఇదీ.. ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
May 02, 2023 03:59 PM IST

Onion Juice for Hair: ఉల్లిరసం ఎలా ఉపయోగిస్తే జుట్టు రాలడం ఆగుతుంది, ఎంత కాలం ఉపయోగించాలి మొదలైన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Onion Juice for Hair
Onion Juice for Hair (istock)

Onion Juice for Hair: ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను నయం చేయగలవు. జుట్టు సంరక్షణకు సంబంధించి మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మీరు గమనించినట్లయితే వాటిలో చాలా వరకు వాటిలో ఖరీదైనవి ఉల్లిసారంతో తయారు చేసినవే అయి ఉంటాయి. అయితే మీ జుట్టు సమస్యలను నయం చేసుకోవడానికి ఇలాంటి ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం ఏం లేదు. ఇంటి నివారణ మార్గాలే ప్రభావంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఉల్లినూనెలు (Onion Oil) జుట్టు రాలడం సమస్యను పరిష్కరిస్తాయని చాలా మంది నమ్ముతారు. అయినప్పటికీ ఉల్లినూనెకు బదులు ఉల్లిపాయ రసం (Onion Juice) మరింత మెరుగైన ఫలితాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ రసంలో సల్ఫర్ (Sulphur) పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు చిట్లడం (split hair) , పల్చబడడాన్ని నిరోధిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ తిరిగి పెరగడానికి సల్ఫర్ అవసరం. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి తెల్లవెంట్రుకలను నివారించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయ మీ జుట్టుకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని (Hair Fall) నిరోధించడంలో, ఆరోగ్యవంతమైన జుట్టును అందించడంలో సహాయపడుతుంది.

How To Use Onion Juice for Hair- ఉల్లిరసాన్ని జుట్టుకు ఎలా వర్తించాలి?

మీరు జుట్టుకు ఉల్లిపాయను పలు విధాలుగా ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయ రసాన్ని తీసి నేరుగా మీ జుట్టుకు పట్టించడమే. మూడు నుండి నాలుగు ఉల్లిపాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆపై వాటిని పిండి రసం తీయడం లేదా మిక్సర్ జార్ లో వేసి రుబ్బడం ద్వారా మెత్తని మిశ్రమం (Homemade Onion Juice) చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ రసాన్ని ఒక కాటన్ ప్యాడ్ ఉపయోగించి మీ తలకు రాయండి. ఆపై దీన్ని స్కాల్ప్‌కి మసాజ్ చేసి, ఒక గంట పాటు అలాగే ఉంచి, ఆపై షాంపూతో శుభ్రం (Hair Wash) చేసుకోండి.

ఇలా వారానికి ఒకసారి 8 వారాల పాటు లేదా రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వర్తిస్తే మీ తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది, మీ జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. దీంతో వెంట్రుకల కుదుళ్లకు పోషకాలు అందడంతో జుట్టు పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ సాంద్రతను తగ్గించి మీ జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఉల్లిరసాన్ని వర్తిస్తున్న సందర్భంలో మీరు జుట్టుకు ఉల్లిపాయ నూనె లేదా మరేఇతర నూనెను వర్తించాల్సిన అవసరం లేదు, కేవలం ఉల్లిరసమే మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం