Almond Peels Uses । బాదం పొట్టుతో మీ జుట్టుకు గట్టి మేలు.. ఇలా ఉపయోగిస్తే!
Almond Peels Uses: బాదం పొట్టును పారేయకండి. మీ జుట్టు, చర్మ సంరక్షణ కోసం వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
Almond Peels Uses: బాదంపప్పు బలవర్ధకమైన ఆహారం. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే బాదంపప్పును నేరుగా తినకుండా నానబెట్టుకొని, పొట్టు తీసి తినాలని చెబుతారు. అయితే మీరు నానబెట్టుకొని తినగా మిగిలిన బాదంపప్పు పొట్టును పారేస్తున్నారా? కానీ, ఈ పొట్టు కూడా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందట. ముఖ్యంగా బాదంపప్పు పొట్టును జుట్టు, చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చునని చెబుతున్నారు.
బాదంలో జుట్టును పర్యావరణ కాలుష్యం నుండి రక్షించే కొన్ని పోషకాలు ఉంటాయి. బాదంపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ మొదలైనవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదంపప్పు తినడం జుట్టుకు ఎంత మేలు చేస్తుందో, దాని పొట్టును పేస్ట్‌గా చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. మీ జుట్టు సంరక్షణ కోసం బాదంపప్పును, బాదంపప్పు పొట్టును ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
Almond Peel Paste For Hair -బాదం పొట్టు పేస్ట్ ఎలా చేయాలి?
జుట్టు పెరుగుదలకు బాదం పొట్టు పేస్ట్ ఉపయోగించావచ్చు. బాదంపొట్టులో గుడ్డు, తేనె, అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తర్వాత షాంపూతో కడగాలి. అదనంగా మీరు నానబెట్టి పొట్టు తీసిన బాదంగింజలను ప్రతిరోజూ ఉదయం 4-5 తినండి. ఈ రకంగా మీ జుట్టుకు వెలుపలి నుంచి లోపలి నుంచి పోషణ లభిస్తుంది.
మీకు దురద సమస్య (itchy Scalp) లేదా మీ తలలో పేను ఉంటే, బాదం పలుకుల దాని పొట్టుతో పాటు నూరండి. మెత్తని పేస్ట్ చేసి, ఆ పేస్టును తలకు రాసుకుంటే, త్వరగా తలలో దురద సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
Almond Face Pack- బాదం పొట్టు ఫేస్ ప్యాక్
బాదం పొట్టులో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కోవటానికి కూడా సహాయపడుతుంది. బాదం పొట్టును ముఖంపై ఉపయోగించడం ఎలా అంటే. మీకు నచ్చిన ఏదైనా ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకునేటపుడు అందులో బాదం పొట్టును కూడా మిక్స్ చేయండి. అప్పుడు ఆ ఫేస్ ప్యాక్ (Homemade face pack)మీ చర్మానికి అప్లై చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీ చర్మానికి మంచి పోషణ లభించి, తాజాగా హైడ్రేటెడ్‌గా కనిపిస్తుంది.
సంబంధిత కథనం