Aloe Vera for Skin Care । వేసవిలో ఆరోగ్యమైన చర్మం కోసం కలబందను ఇలా వాడండి!-7 cool ways to use aloe vera for your skincare routine in the hot summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloe Vera For Skin Care । వేసవిలో ఆరోగ్యమైన చర్మం కోసం కలబందను ఇలా వాడండి!

Aloe Vera for Skin Care । వేసవిలో ఆరోగ్యమైన చర్మం కోసం కలబందను ఇలా వాడండి!

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 07:07 AM IST

Aloe Vera for Skin Care: వేసవిలో మీ చర్మ సంరక్షణలో భాగంగా కలబందను ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి

Aloe Vera for Skin Care
Aloe Vera for Skin Care (istcok)

Aloe Vera for Skin Care: ఈ వేసవిలో మీ చర్మ సంరక్షణ కోసం కలబందను ఉపయోగించండి. కలబంద అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన మొక్క. దీనిలోని ఔషధ గుణాల కారణంగా కలబందను చర్మానికి, వెంట్రుకల కోస ఒక సహజమైన సౌందర్య సాధనంగా ఉపాయోగిస్తారు. కలబంద జెల్ ను చర్మానికి ఉపయోగ్గించి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. అది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కలబంద జెల్ ను మాయిశ్చరైజర్‌గా, టోనర్‌గా, ఫేస్ మాస్క్‌గా లేదా ఐ క్రీమ్‌గా కూడా ఉపయోగించవచ్చు.

అలోవెరాలోని గుణాలు కఠినమైన వేసవి నెలలలో మీ చర్మాన్ని శాంతపరచడానికి, చర్మానికి అవసరమైన పోషణ అందించడానికి సహాయపడతాయి. వేసవి చర్మ సంరక్షణలో (Aloe Vera in Summer Skin Care) కలబందను ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి.

మాయిశ్చరైజర్‌గా అలోవెరా జెల్

అలోవెరా జెల్ ఒక అద్భుతమైన సహజమైన మాయిశ్చరైజర్, ఇది వేడి వేసవిలో మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. సన్‌స్క్రీన్ లేదా మేకప్ వేసుకునే ముందు మీ ముఖానికి అలోవెరా జెల్ పలుచని పొరను అప్లై చేయండి.

కలబంద ఒక శీతలీకరణ ఏజెంట్

వేసవిలో చర్మం కాలడం, నల్లబడటం సర్వసాధారణం. వేసవి ఉష్ణోగ్రతలతో వేడెక్కిన చర్మానికి చల్లటి అనుభూతిని అందిస్తుంది. చర్మంలోని మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. తక్షణ ఉపశమనం కోసం ప్రభావిత ప్రాంతాల్లో అలోవెరా జెల్ (Aloe Vera Gel) పలుచని పొరను వర్తించండి.

అలోవెరాను ఫేస్ మాస్క్‌గా

అలోవెరాను ఫేస్ మాస్క్‌గా (Aloe Vera Face mask) కూడా ఉపయోగించవచ్చు, ఇది చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌కి ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా టోనర్‌గా

అలోవెరా మీ చర్మం pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడటానికి టోనర్‌గా (Aloe Vera Toner) కూడా ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్, నీటిని సమపాళ్లలో మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని కాటన్ ప్యాడ్‌తో మీ ముఖానికి అప్లై చేయండి.

కలబందను కంటి క్రీమ్‌గా

అలోవెరాను మీ కంటికి క్రీమ్‌గా (Aloe Vera eye crem)కూడా ఉపయోగించవచ్చు, ఇది కంటి కింద నల్లటి వలయాలు, ఉబ్బిన కళ్లలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు మీ కళ్ల కింద కొద్ది మొత్తంలో అలోవెరా జెల్‌ను అప్లై చేయండి.

అలోవెరా బాడీ లోషన్‌గా

మీ చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచడానికి అలోవెరా జెల్‌ను బాడీ లోషన్‌గా (Aloe Vera body lotion) కూడా ఉపయోగించవచ్చు. స్నానం చేసిన తర్వాత మీ చర్మానికి అలోవెరా జెల్‌ను ఉదారంగా రాయండి.

అలోవెరా లిప్ బామ్‌గా

కలబందను మీ పెదాలను హైడ్రేట్‌గా ఉంచడానికి, ఎండ నుండి రక్షించడానికి సహజమైన లిప్ బామ్‌గా (Aloe Vera Lip Balm) కూడా ఉపయోగించవచ్చు. రోజంతా అవసరమైన విధంగా మీ పెదాలకు అలోవెరా జెల్‌ను కొద్ది మొత్తంలో అప్లై చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం