Sunscreen Indoors | ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్‌ను వాడాలి, ఎందుకో తెలుసా?
Wear Sunscreen Indoors: ఎండలో తిరిగేటపుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్‌ను ధరించాలి. దీని వలన ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Wear Sunscreen Indoors: బయటకు వెళ్లేటపుడు కచ్చితంగా మీ చర్మానికి సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి. ఈ వేసవికాలంలో (Summer) అయితే తప్పకుండా సన్‌స్క్రీన్ అనేది మీ రొటీన్ చర్మసంరక్షణలో ఒక భాగంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ మొఖానికి, కాళ్లకు, చేతులకు సన్‌స్క్రీన్ రాసుకోవడం ఉత్తమం. అది ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సన్‌స్క్రీన్ (Sunscreen lotion) అనేది హానికరమైన సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించే రక్షణ కవచంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే చాలామంది సన్‌స్క్రీన్‌ను బయటకు వెళ్తున్నప్పుడు, ఎండలో తిరుగుతున్నప్పుడు మాత్రమే చర్మానికి అప్లై చేసుకోవాలని భావిస్తారు. కానీ, ఈ వేసవిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటిలోపలికి కూడా సూర్యకిరణాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్‌ను ధరించాలి. ఇది మాత్రమే కాదు, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చర్మానికి సన్‌స్క్రీన్ ధరించడం వలన ప్రయోజనాలు చాలా ఉంటాయి.
బ్లూ లైట్ నుండి రక్షిస్తుంది
ఇటీవల స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ , స్మార్ట్ టీవీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజంతా వీటితోనే గడుపుతుంటాం. అయితే వీటి డిస్‌ప్లేల నుంచి బ్లూలైట్ కాంతి కిరణాలు వెలువడుతాయి. ఇవికూడా అతినీలలోహిత కిరణాల వలె హానికర ప్రభావాలను కలిగి ఉన్నాయి. దీర్ఘకాలికంగా బ్లూలైట్ కిరణాలకు గురికావడం వలన DNA దెబ్బతినడం, కణజాల నష్టన్, కంటిచూపు కోల్పోవడం, చర్మ అవరోధం దెబ్బతినడం, ఫోటోయేజింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయని ఇటీవలి కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే మొబైల్, ల్యాప్‌టాప్ వాడేటపుడు కళ్లకు రక్షణ కోసం కంప్యూటర్ గ్లాసెస్ వాడుతున్నట్లే చర్మానికి సన్‌స్క్రీన్ రక్షణ (Blue light protection) కల్పిస్తుంది. జింక్ ఆక్సైడ్ టైటానియం డయాక్సైడ్‌తో తయారు చేసిన కొన్ని సన్‌స్క్రీన్‌లు బ్లూ లైట్‌ను నిరోధించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది
మీరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అతినీలలోహిత కిరణాలు మీ ఇంట్లోకి ప్రవేశించి, మీ చర్మం లోపలి వరకు చొచ్చుకుపోయి నష్టాన్ని కలిగిస్తాయి. UVB కిరణాల వలన వృద్ధాప్య సంకేతాలు త్వరగా (Premature Ageing) వస్తాయి, సన్‌స్క్రీన్ దీనిని నివారిస్తుంది. కనీసం SPF 30+ వాల్యూమ్ కలిగిన సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి, అప్పుడే ప్రభావం ఉంటుంది. మీ సన్‌స్క్రీన్ నాణ్యత ఏమిటో ఈ SPF వాల్యూమ్ తెలియజేస్తుంది. దీని సమాచారం లేబుల్ పై ముద్రించి ఉంటుంది.
సన్‌స్క్రీన్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది
మీరు ప్రత్యేకంగా మాయిశ్చరైజర్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఏడాది పొడవునా సన్‌స్క్రీన్‌ను మాయిశ్చరైజర్‌గా (Sunscreen as moisturizer) కూడా ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ మాయిశ్చరైజింగ్ ఉత్పత్తులతో మిళితం చేయవచ్చు లేదా మేకప్‌కు జోడించవచ్చు. ఇది త్వరగా పని చేస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది.
చర్మ క్యాన్సర్ నుండి రక్షణ
UVB రేడియేషన్ ద్వారా కలిగే ఇన్ల్ఫమేటరీ రియాక్షన్ ద్వారా సన్ బర్న్ వస్తుంది. ఈ సన్‌బర్న్ తర్వాత మిగిలిపోయిన కణాలు కాలక్రమేణా చర్మ క్యాన్సర్ (Skin Cancer)ను అభివృద్ధి చేసే అవకాశాన్ని పెంచుతాయి. దీనికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించి ముందుస్తుగా అడ్డుకట్ట వేయవచ్చు.
సంబంధిత కథనం