Natural Moisturizers : వింటర్‌లో డ్రై స్కిన్ నుంచి కాపాడే సహజమైన మాయిశ్చరైజర్లు ఇవే-know these 6 natural moisturizers to repair your dry skin in winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Moisturizers : వింటర్‌లో డ్రై స్కిన్ నుంచి కాపాడే సహజమైన మాయిశ్చరైజర్లు ఇవే

Natural Moisturizers : వింటర్‌లో డ్రై స్కిన్ నుంచి కాపాడే సహజమైన మాయిశ్చరైజర్లు ఇవే

Geddam Vijaya Madhuri HT Telugu
Apr 06, 2023 11:17 AM IST

Natural Moisturizers : వింటర్ సీజన్ రావడం మొదలు మీ చర్మం కంప్లైంట్ చేయడం మొదలు పెడుతుంది. పొడి బారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు చిరాకు పెడుతుంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మీరు మాయిశ్చరైజర్లు వాడాల్సిందే అంటున్నారు నిపుణులు.

వింటర్ స్కిన్ కేర్
వింటర్ స్కిన్ కేర్

Natural Moisturizers : వింటర్ సీజన్ రాగానే చర్మం ఎదుర్కొనే సమస్యలకు చెక్ పెట్టాలంటే దానికి తగిన కేర్ తీసుకోవాలి. గాలిలో తేమ తగ్గిన కొద్దీ అది మీ చర్మంపై ఉన్న మాయిశ్చర్‌ను మాయం చేసేస్తుంది. ఈ కారణంగానే మీ చర్మం పొడిబారుతుంది. కొన్నిసార్లు పగుళ్లు ఏర్పడుతాయి. చర్మవ్యాధి సంబంధిత వైద్య నిపుణులు మీ చర్మం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెబుతారు. ఇందుకు మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీముల కంటే సహజ మాయిశ్చరైజర్స్‌ వాడడం మంచిది. ఇంతకీ సహాజమైన మాయిశ్చరైజర్లు ఏమిటి? వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అలొవెరా

అలొవెరా మన ఇంట్లో పెరిగే ఔషధ మొక్క. దీనికి ఉండే మందపాటి ఆకుల నిండా ఒక జెల్‌లాంటి పదార్థం నాచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఆకు నుంచి మొత్తం జెల్ సేకరించి ముఖంపై పూసుకోవడమే. ఆరిన తరువాత కొన్ని నిమిషాల పాటు ఆగి నీటితో కడుక్కుంటే సరిపోతుంది. మీ చర్మం సహజంగా, ఎలాంటి జిడ్డూ లేకుండా మాయిశ్చరైజర్‌ను అందిస్తుంది.

తేనె

చర్మం పొడిగా ఉన్నప్పుడు తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మంపై దీనిని పూసి కాస్త మర్థన చేస్తూ ఓ పది నిమిషాల పాటు ఆగాలి. కొద్దిగా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వీలున్నప్పుడల్లా ఇలా చేస్తూ ఉండాలి.

ఆలివ్ ఆయిల్

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహజసిద్ధమైన నూనెలు బాగా పనిచేస్తాయి. ఆలివ్ ఆయిల్ కూడా అందులో ఒకటి. దీనిని రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుంటే చాలు. పొడి బారిన చర్మాన్ని ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటాక్సిడంట్లు కోలుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ముఖంపై చారలను తొలగిస్తుంది.

కొబ్బరి నూనె

వింటర్‌లో మీ చర్మం పగలకుండా, పొడిబారకుండా చేసే నూనెల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. రాత్రి పూట మీ ముఖానికి, చర్మానికి, చేతులకు అప్లై చేసుకోవాలి. కొబ్బరి నూనె వల్ల మీ చర్మం మృదువుగా మారుతుంది. వింటర్‌లో ప్రతిరోజూ ఇలా చేస్తే మేలు.

బాదం నూనె

బాదం నూనె నుంచి వచ్చే సువాసనతో మీకు పాజిటివ్ మూడ్ వస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్ ఇ మీ చర్మం పగుళ్లకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. స్నానానికి ముందు బాదాం నూనె మీ ముఖానికి, చర్మానికి అప్లై చేయొచ్చు. తద్వారా మీ చర్మం మృదువుగా మారుతుంది. బాదాం సహజ మాయిశ్చరైజర్‌గా తోడ్పడుతుంది. మీ మేని తేమను కోల్పోకుండా కాపాడుతుంది.

బొప్పాయి

బొప్పాయి గుజ్జు కూడా నాచురల్ మాయిశ్చరైజర్. బొప్పాయి గుజ్జుకు కాస్త తేనె కలిపి మిశ్రమంలా చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని మీ ముఖానికి లేదా పొడిబారిన చర్మానికి 10 నిమిషాలపాటు అప్లై చేసి కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.

తేనె, , ,

Whats_app_banner

సంబంధిత కథనం