Papaya Health Benefits : బ్రంచ్​గా బొప్పాయి తినండి.. బరువు తగ్గుతారు..-papaya health benefits specially for weight loss and good digestion and body detoxing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Papaya Health Benefits : బ్రంచ్​గా బొప్పాయి తినండి.. బరువు తగ్గుతారు..

Papaya Health Benefits : బ్రంచ్​గా బొప్పాయి తినండి.. బరువు తగ్గుతారు..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 25, 2022 07:48 AM IST

Papaya for Weightloss : బరువు తగ్గాలి అనుకునేవారు.. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు కచ్చితంగా తమ డైట్​లో బొప్పాయిని కలిపి తీసుకోవాలి. అది అందించే ఫలితాలు మీకు తెలిస్తే.. ఎవరూ చెప్పకుండానే.. మీరు డైలీ బొప్పాయి తింటారు. బరువు తగ్గడం నుంచి.. క్యాన్సర్​ నుంచి రక్షణ ఇవ్వడం వరకు బొప్పాయి చేసే మేలు అంతా ఇంతా కాదు.

బరువు తగ్గడానికి బొప్పాయి బెస్ట్
బరువు తగ్గడానికి బొప్పాయి బెస్ట్

Papaya for Weightloss : బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. దీనికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ఎంపికలు అవసరం. సుదీర్ఘ ప్రయత్నాలు చేసినప్పటికీ.. మీరు అవాంఛనీయ బరువును తగ్గించుకోలేక పోయారంటే.. దానికి కారణం చెడు జీర్ణక్రియ, శరీర డిటాక్స్ లేకపోవడం. అయితే బొప్పాయి అద్భుతమైన జీర్ణశక్తి, డిటాక్స్ శక్తులను కలిగి ఉంటుందని తెలుసుకోండి. దీనిని ఒక్కటి తీసుకుంటే చాలు.. మీరు చాలా పోషకాలు పొందుతారు. ఇంతకీ ఈ బొప్పాయి బరువు తగ్గించడానికి ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయిలోని పోషక విలువలు

బొప్పాయి అధిక పోషకాలు కలిగిన పండు. కేవలం ఒక కప్పు బొప్పాయిలో.. (54 గ్రాములు). దానిలో 2.5 గ్రాముల ఫైబర్, 1 గ్రాముల ప్రోటీన్, 13.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, అనేక ముఖ్యమైన విటమిన్లు (A,C,E,K), కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్‌లు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు. కాబట్టి బొప్పాయిని కచ్చితంగా మీ డైట్లో కలిపి తీసుకోవచ్చు.

తక్కుల క్యాలరీలు.. ఎక్కువ ఫైబర్

బరువు తగ్గడానికి బొప్పాయిని సరైన ఎంపిక. ఎందుకంటే దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల అవాంఛిత కొవ్వు పేరుకుపోదు. అలాగే ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని కొన్ని గంటల పాటు నిండుగా ఉంచుతుంది. తద్వారా అనవసరమైన చిరుతిండి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. బ్రంచ్ కోసం దీన్ని తీసుకోండి. దీనివల్ల మీరు చిప్స్ వంటి ఆహారం కోసం ఆరాటపడరు.

జీర్ణక్రియకు, శరీర డిటాక్స్​కు మంచిది

బొప్పాయి తీసుకోవడం వల్ల పేగు కదలిక మెరుగుపడుతుంది. అంతేకాకుండా మంచి జీర్ణక్రియ ప్రక్రియను మీ సొంతం చేసుకోవచ్చు. బొప్పాయి తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గుండెల్లో మంట వంటి జీర్ణవ్యవస్థ లక్షణాలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అలాగే బొప్పాయి పండులో పాపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, పేగు గోడలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను మరింత పెంచుతుంది. తద్వారా ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులోని ఆమ్లాలు పెరగకుండా.. వాటితో పోరాడటానికి సహాయం చేస్తుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్ బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంది. ఇది శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తద్వారా జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడాన్ని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడంలో మంట మరొక ప్రధాన అడ్డంకి. అయితే శుభవార్త ఏమిటంటే బొప్పాయి వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు.. శరీరంలో మంటతో పోరాడుతాయి. ఆరోగ్యకరమైన బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

అవాంఛిత బరువును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా.. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్​లో ఉంటుంది. క్యాన్సర్ నుంచి రక్షణను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం