Ways to prevent Diabetes : జీవనశైలిలో ఈ మార్పులు చేస్తే.. మధుమేహాన్నిదూరం చేసుకోవచ్చు..
Ways to prevent Diabetes : మధుమేహం రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చాక చేసేదేమి లేదు కాబట్టి.. ఇప్పటినుంచే కొన్ని పనులు చేస్తే.. మధుమేహం రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ చర్యలు ఏమిటి? ఏమి పాటిస్తే.. మధుమేహానికి దూరంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Ways to prevent Diabetes : రోజూ రోజుకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఫ్యూచర్లో దాని బారిన పడకూడదంటే.. ఇప్పటినుంచే మెరుగైన జీవనశైలిని ఫాలో అవ్వాల్సి ఉంది. ఎందుకంటే మధుమేహం వంటి వ్యాధి శరీరంలో వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు.. శరీరంలో అనేక ఇతర శారీరక వ్యాధులు కూడా వస్తాయి. అందుకే మధుమేహానికి దూరంగా ఉండాలి. జీవనశైలిలో అనేక మార్గాలను అనుసరించడం ద్వారా మధుమేహాన్ని నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు
మధుమేహం నుంచి బయటపడటానికి మొదటి మార్గం బరువు తగ్గడం. ఊబకాయం ఉన్నవాళ్లు.. మధుమేహం బారిన పడతారని మనకి తెలుసు. బరువు తగ్గడం వల్ల మధుమేహాన్ని 60 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆహారం, వ్యాయామం ద్వారా మీ శరీర బరువులో 7 శాతం కోల్పోవడం.. మధుమేహం నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. కానీ అధిక కొవ్వు లేదా అధిక బరువు ఉన్నట్లయితే.. దానిని తగ్గించే దిశగా వెళ్లడం మంచిది.
పని
మీరు ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు చేసుకున్నట్లయితే లేదా మీరు రోజంతా కూర్చొని పని చేస్తే కనీసం రోజుకు ఒక్కసారైనా నడవడం అవసరం. రోజంతా పనిలో ఉండి శరీర భాగాలను కదిలిస్తే లావు పెరిగే అవకాశం ఉండదు. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని దూరంగా ఉంటుంది.
ఆహారం
ఆహారంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఉండాలి. బ్రోకలీ వాటిలో ముఖ్యమైనది. అలాగే ఆహారంలో పండ్లు, బీన్స్, చిక్పీస్ ఉండాలి. ఆహారంలో బియ్యం, ఓట్స్, క్వినోవా వంటివి చేర్చుకోవడం వల్ల మధుమేహం, అనేక ఇతర వ్యాధులను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.
మంచి కొవ్వులు
'అసంతృప్త కొవ్వు'ని తరచుగా మంచి కొవ్వు అంటారు. ఇది శరీరానికి మంచిది. కొన్నిసార్లు ఇది మధుమేహాన్ని నివారించే ప్రక్రియలో సహాయపడుతుంది. ఈ సందర్భంలో ఆలివ్ నూనె లేదా శానోఫ్లవర్ నూనెను ఉపయోగించవచ్చు. మాంసం, పాల ఉత్పత్తులను కనిష్టంగా ఉంచండి. బాదంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిని ఫాలో అయ్యేముందు మీరు వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకోండి.
సంబంధిత కథనం