Homemade Digestive Powder । ఆహారం జీర్ణం చేసే చూర్ణం.. బండలు తిన్నా పిండిగా మారుస్తుంది! -consume this digestive powder a homemade remedy for all your tummy woes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Consume This Digestive Powder, A Homemade Remedy For All Your Tummy Woes

Homemade Digestive Powder । ఆహారం జీర్ణం చేసే చూర్ణం.. బండలు తిన్నా పిండిగా మారుస్తుంది!

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 08:45 PM IST

Homemade Digestive Powder: ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆయాస పడిపోతున్నారా? ఈ చూర్ణం పాలల్లో కలుపుకొని తాగి చూడండి. బండలు సైతం పిండిగా మారతాయి.

Homemade Digestive Powder
Homemade Digestive Powder

ఈ మధ్య కాలంలో చాలా మందికి చాలా రకాలుగా తినాలని ఉన్నా తినలేరు, ఎందుకంటే ఆ తిన్నది అరుగుతుందో లేదోనన్న భయం. కొంతమందికి అయితే ఈరోజు తిన్న ఆహారం జీర్ణం కావటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. తరచూ మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకప్పుడు జీర్ణసమస్యలు అనేవి వయసు మళ్లిన వారికి మాత్ర వచ్చేవి. ఇప్పుడు యువకులకు సైతం జీర్ణ సమస్యలతో పాటు బీపీ, షుగర్, గుండె జబ్బులు అన్నీ ఉంటున్నాయి. కారణం జీవనశైలి మారింది, ఆహారంలో నాణ్యత తగ్గింది.

రాళ్లు తిన్నా అరిగే వయసులోనూ, తిన్న ఆహారం కడుపులోనే రాయిలాగా మారే పరిస్థితి వచ్చింది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం అనేది ఉండటం లేదు. ఆ మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు మన వంటగదినే ఫార్మసీగా అనుకుంటే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది.

ఇక్కడ అజీర్తిని నివారించి, తిన్న ఆహారం సులభంగా జీర్ణం చేసే ఒక చూర్ణం రెసిపీని అందిస్తున్నాం. ఈ చూర్ణం సేవిస్తే. బండలు తిన్నా, పిండిలా అరిగిపోతుంది. ఈ అజీర్తి చూర్ణం తయారీకి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ కింద రెసిపీని చూడండి.

Homemade Digestive Powder Recipe కోసం కావలసిన సామాగ్రి

  • 4-5 నల్ల యాలకులు
  • అర చెంచా నల్ల మిరియాలు
  • రెండు చెంచాల వాము
  • రెండు చెంచాల మెంతులు
  • అర చెంచా నెయ్యి
  • చిటికెడు ఇంగువ

అజీర్తి చూర్ణం రెసిపీ- తయారు చేసే విధానం

  1. పొయి మీద పాన్ వేడి చేసి, అది వేడయ్యాక మిరియాలు, వాము, యాలకులు వేసి దోరగా వేయించాలి. అనంతరం వీటిని పక్కనపెట్టుకోండి.
  2. ఇప్పుడు పాన్‌లో అర చెంచా నెయ్యి వేడి చేసి అందులో మెంతులను వేసి వేయించాలి.
  3. ఇప్పుడు అన్నింటిని కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి, ఇందులోనే ఇంగువ, రుచికోసం కొంచెం ఉప్పు వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి.
  4. అంతే, అజీర్తి చూర్ణం రెడీ. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఈ చూర్ణంను గాజు సీసాలోకి నిల్వచేసుకోవాలి.

ఈ అజీర్తి చూర్ణంను అర చెంచా మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో లేదా పాలలో కలుపుకొని భోజనం తర్వాత సేవించాలి. ఇక, అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్