DIY Homemade Face Wash । మీకు మీరుగా ఫేస్ వాష్ తయారు చేసుకోండిలా.. చలికాలంలో ఇదే బెస్ట్!
DIY Homemade Face Wash: చలికాలంలో సబ్బులు మీ చర్మంపై కఠిన ప్రభావం చూపవచ్చు. మీ ముఖాన్ని శుభ్రంచేసుకోవడానికి ఇంట్లోనే ఫేస్ వాష్‌లు తయారు చేసుకోవచ్చు.
చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చల్లటి వాతావరణంలో చర్మం తేమను కోల్పోయి, పొడిగా మారుతుంది. అదేసమయంలో దుమ్ము, ధూళి ముఖంపై పేరుకుపోతుంది. ధూళి రేణువులు చర్మంపై ఉన్న రంధ్రాలను మూసివేస్తాయి. దీంతో చర్మంపై చికాకు, మొటిమలు, పొరలుగా ఊడిపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి సందర్భంలో ముఖానికి సబ్బు ఉపయోగించడం లేదా మార్కెట్లో లభించే రసాయనాలతో నిండిన ఫేస్ వాష్‌లను ఉపయోగించడం వలన అవి మీ చర్మంపై కఠినంగా వ్యవహరిస్తాయి. బదులుగా మీరు సహజమైన, ఇంట్లో ఫేస్ వాష్‌లను తయారుచేసుకొని ఉపయోగించవచ్చు. ఇవి మీ ముఖంలోని మలినాలను సున్నితంగా క్లియర్ చేస్తాయి, మీకు శుభ్రమైన ముఖాన్ని అందిస్తాయి, సహజమైన నిగారింపును సొంతం చేసుకోవచ్చు.
తేనె- పెరుగు ఫేస్ వాష్
తేనె మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, తేమగా చేస్తుంది. పెరుగు మీ ముఖాన్ని కోమలంగా, మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ వాష్ రెసిపీని కింద చూడండి.
కావలసిన పదార్థాలు:
3 టేబుల్ స్పూన్ల పెరుగు
1 టీస్పూన్ తేనె
తయారీ విధానం: ఒక గిన్నెలో తేనె, పెరుగు రెండూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి, కొన్ని నిమిషాలు ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి. అనంతరం మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్- గ్లిజరిన్ క్లెన్సర్
ఆలివ్ ఆయిల్, గ్లిజరిన్ రెండూ కూడా పొడి చర్మంను పరిష్కరించే అద్భుత పదార్థాలు. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తాయి.
కావలసిన పదార్థాలు:
1/2 కప్పు ఆలివ్ ఆయిల్
2 టేబుల్ స్పూన్లు గ్లిజరిన్
తయారీ విధానం: ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్, గ్లిజరిన్ లను కలపండి. అలాగే కొన్ని టీస్పూన్ల నీరు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన సీసాలో నిల్వ చేయండి. దీనిని మీరు ముఖం కడుక్కోవడానికి కొద్దిగా వాడండి. మీ ముఖమంతా మసాజ్ చేసి, ఆపై సాధారణ నీటితో కడగాలి.
మిల్క్ ఫేస్ వాష్
పాలలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని చాలా కాలం పాటు తేమగా , మృదువుగా ఉంచుతాయి. పసుపును మనం చాలా ఏళ్లుగా చర్మానికి ఉపయోగిస్తాం. పాలలో చిటికెడు పసుపు కలిపితే అందమైన మెరుపు వస్తుంది.
కావలసిన పదార్థాలు:
3 టేబుల్ స్పూన్లు పాలు
చిటికెడు పసుపు
తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు, చిటికెడు పసుపు వేయాలి. రెండు పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం అంతా సర్క్యులర్ మోషన్‌లో అప్లై చేసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తడి టవల్ లేదా గుడ్డను ఉపయోగించి, దానిని శుభ్రం చేయండి.
సంబంధిత కథనం
టాపిక్