Hair Oil Treatment । మీ జుట్టుకు ఈ నూనెలతో చికిత్స చేయండి, మ్యాజిక్ జరుగుతుంది!-ayurvedic hair oil treatment for hair growth and hair fall prevention ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Oil Treatment । మీ జుట్టుకు ఈ నూనెలతో చికిత్స చేయండి, మ్యాజిక్ జరుగుతుంది!

Hair Oil Treatment । మీ జుట్టుకు ఈ నూనెలతో చికిత్స చేయండి, మ్యాజిక్ జరుగుతుంది!

HT Telugu Desk HT Telugu
Apr 26, 2023 11:20 AM IST

Hair Oil Treatment: జుట్టుకు సంబంధించిన సమస్యలకు అనేక రకాల ఉత్పత్తులు ఉన్నప్పటికీ, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానమే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ జుట్టు కోసం ఇక్కడ కొన్ని చికిత్సలు చూడండి.

Hair Oil Treatment
Hair Oil Treatment (istock)

Hair Oil Treatment: జుట్టు రాలడం (Hair Fall), వెంట్రుకలు తెల్లబడటం (Greying Hair ), తలలో చుండ్రు (Dandruff) వంటివి ఇప్పుడు స్త్రీ,పురుషులిద్దరిలో సర్వసాధారణంగా మారాయి. పెరుగుతున్న వయసుతో పాటు నిరంతరమైన ఒత్తిడి (stress) , హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం సహా అనేక బాహ్య కారకాలు కూడా జుట్టు సమస్యలకు (Hair Issues) దోహదం చేస్తాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలకు అనేక రకాల ఉత్పత్తులు ఉన్నప్పటికీ, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానమే (Ayurvideic Remedies) అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నేడు చాలా మంది యువత జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు, బట్టతలను (Bald Head) కలిగి ఉంటున్నారు. కానీ నిన్నటి తరం వారికి ఈ సమస్యలు ఏమి లేవు. వారి జుట్టు ఇప్పటికీ ఒత్తుగా, దృఢంగా (Strong Hair) ఉండటం మీరు గమనించవచ్చు. ఎందుకంటే వారు ఆడంబరాలకు ఆకర్శితం కాకుండా సహజమైన జుట్టు సంరక్షణను (Hair Care) కలిగి ఉండేవారు. మీరు కూడా మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటే మీ జుట్టు పెరుగుదలకు (Hair Growth) సహాయపడే కొన్ని నూనెల గురించి ఇక్కడ చర్చించుకుందాం. ఈ నూనెలతో మీ జుట్టుకు చికిత్స చేయడం ద్వారా నిండైన జుట్టును (Thick Black Hair) పొందవచ్చు.

కరివేపాకు కొబ్బరి నూనె చికిత్స

జుట్టు పెరుగుదలకు గానీ, నల్లని వెంట్రుకలుకు గానీ, జుట్టుకు పోషణ విషయంలో గానీ చాలా మంది తమ జుట్టు సంరక్షణ కోసం కొబ్బరినూనె (Coconut Oil) చాలా మంచిదని విశ్వసిస్తారు. కొబ్బరినూనె దాని పోషక గుణాల కారణంగా, ఆయుర్వేద జుట్టు సంరక్షణలోనూ మేలైన ఎంపిక. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి ప్రోటీన్ పోషణ అందిస్తుంది. మరోవైపు కరివేపాకు (Curry Leaves) కూడా జుట్టుకు ఒక ఔషధ మూలిక. ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు , అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కరివేపాకు కొబ్బరి నూనెతో మీ జుట్టుకు చికిత్స చేయడానికి.. ముందుగా ఒక పాన్‌లో కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి, అందులో తాజా కరివేపాకులను కలపండి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మీ తలకు, జుట్టుకు మసాజ్ చేయండి. 30 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూతో కడిగేసుకోండి.

భృంగరాజ్ తైలం

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో భృంగరాజ్ తైలం ఎంతో ప్రసిద్ధి. ఈ మూలికా నూనె (herbal oil) లో ఐరన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. దీంతో జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి జుట్టు రాలడం ఆగిపోతుంది.. భృంగరాజ్ తైలం అనేది ఉసిరి, బ్రహ్మి, వేప వంటి ఆయుర్వేద మూలికలతో తయారైన నూనె. ఈ మూలికలు తలపై చర్మానికి చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి, జుట్టు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. రోజూ నిద్రపోయే ముందు, భృంగరాజ్ తైలంను మీ తలకు, జుట్టుకు పట్టించి, ఉదయాన్నే కడిగేయండి.

ఉసిరి సారం

ఉసిరిని (Amla) ఆయుర్వేద వైద్యంలో తరచుగా ఉపయోగిస్తారు. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉసిరి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఇది కొల్లాజెన్ (collagen) పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును మంచి స్థితిలో ఉంచుతుంది. మీకు జట్టు సంరక్షణ కోసం ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ చేయండి. ఆ పేస్టును మీ జుట్టుకు, తలపై అప్లై చేసి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. అపై నీటితో శుభ్రం చేసుకోండి. అదనంగా, మీరు కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని కలుపుకొని ఉపయోగించవచ్చు. దీనిని మీ జుట్టుకు, తలపై అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఈ మూడు ఆయుర్వేద చికిత్సలు మీ జుట్టు రాలడాన్ని అరికట్టి, ఆరోగ్యకరమైన వెంట్రుకల పెరుగుదలను అందిస్తాయి. వీటితో పాటు మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మీ ఒత్తిడి స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం.

WhatsApp channel

సంబంధిత కథనం