Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
07 May 2024, 18:30 IST
- Evening Walk Benefits In Summer : నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వేసవిలో సాయంత్రపూట నడవడం వలన మీకు అనేక ఉపయోగాలు ఉన్నాయి.
సాయంత్రం నడక ప్రయోజనాలు
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వేసవిలో సాయంత్రం వేళల్లో నడవడం మరింత మేలు చేస్తుంది. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. బరువు నియంత్రణతో పాటు, నడక రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మీరు ఈ కింది ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
వాకింగ్ చేస్తే ఉపయోగాలు
సాయంత్రం 5 గంటల తర్వాత వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో నడవడం వల్ల అలసిపోరు, ఇంకా ఎక్కువగా నడవచ్చు.
సాయంత్రం వాకింగ్ చేస్తే పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. ఒక్క సెకను కూడా నిద్ర పట్టలేదనే టెన్షన్ ఉండదు. పడుకున్న వెంటనే హ్యాపీ స్లీప్ వస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అరగంట పాటు నడవడం, ఆపై 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేసేందుకు నడక ఎంతో మంచిది. ఈ తేలికపాటి వ్యాయామం గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే శరీర బరువును అదుపులో ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యానికి మంచిది.
వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి
సాయంత్రం 4 గంటల తర్వాత వ్యాయామం చేయాలి. ఇంట్లో వ్యాయామం చేసినా సాయంత్రం 4 గంటల తర్వాతే చేయండి. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు వేడిగా ఉంటుంది.., కాబట్టి సాయంత్రం 5 తర్వాత మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శరీరంలో నీటి స్థాయిని నిర్వహించండి. మీరు వాకింగ్ చేసినా లేదా ఏదైనా వ్యాయామం చేస్తున్నా, మీరు శరీరంలో నీటి స్థాయిని నిర్వహించాలి. ఒక బాటిల్ వాటర్ తీసుకువెళ్లండి, లేకపోతే వ్యాయామం చేసే ముందు సాయంత్రం ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వదు. వ్యాయామం చేయడానికి మీకు శక్తిని ఇస్తుంది.
వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. వేసవిలో మీరు వదులుగా ఉండే కాటన్ డ్రెస్‌లో వ్యాయామం చేయాలి. బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే మీకు ఎక్కువ చెమట పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరం ఏం చెబుతుంతో అర్థం చేసుకోవాలి. నేను చేయలేనని మీ శరీరం చెబితే, మళ్లీ వర్కవుట్ చేయవద్దు. మనం మన శరీరం చెప్పేది వినాలి. మనం ఒత్తిడికి గురికాకుండా వ్యాయామానికి వెళ్లాలి.
మీ శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వ్యాయామం చేయవద్దు. మీరు చాలా తక్కువ నీరు తాగితే మీకు తలనొప్పి వస్తుంది. మీకు వేసవిలో తలనొప్పి వస్తే మీరు మొదట చేయవలసిన పని ఎక్కువ నీరు తాగాలి. మూత్రం చాలా పసుపు రంగులో ఉంటే, అది శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందనడానికి సంకేతం. మీ శరీరానికి నీరు అవసరమా లేదా అనేది మూత్రం రంగును చూసి తెలుసుకోవచ్చు. శరీరంలో నీటి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకండి. నీరు తాగండి. చల్లటి నీటితో స్నానం చేయండి. మీకు బాగా అలసిపోయినట్లు అనిపిస్తే గుడ్డను తడిపి తుడుచుకోండి.