Summer Sleeping Problems : వేసవిలో రాత్రుళ్లు నిద్రించేందుకు ఇబ్బంది పడితే ఈ చిట్కాలు పాటించండి-follow these simple tips to get good sleep in summer nights ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Sleeping Problems : వేసవిలో రాత్రుళ్లు నిద్రించేందుకు ఇబ్బంది పడితే ఈ చిట్కాలు పాటించండి

Summer Sleeping Problems : వేసవిలో రాత్రుళ్లు నిద్రించేందుకు ఇబ్బంది పడితే ఈ చిట్కాలు పాటించండి

Anand Sai HT Telugu
May 06, 2024 06:45 PM IST

Summer Nights : వేసవిలో అంత ఈజీగా నిద్ర రాదు. రాత్రుళ్లు సరిగా నిద్రపట్టదు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా నిద్రపట్టేస్తుంది. వాటి గురించి తెలుసుకోండి.

వేసవిలో నిద్ర చిట్కాలు
వేసవిలో నిద్ర చిట్కాలు (Unsplash)

వేడి కారణంగా అంత ఈజీగా నిద్ర రాదు. రాత్రి బెడ్ మీద ఒక పక్కన పడుకుంటే.. అటువైపు చెమటతో తడిసిపోతుంది. ఇది చికాకు కలిగిస్తుంది. మెలకువ వచ్చేలా చేస్తుంది. అందుకోసం చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. శరీరంలో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. ఇంకా చాలా ఇళ్లలో ఏసీ లేదు. ఫలితంగా ఈ వేసవి రాత్రి హాయిగా నిద్రించడానికి సమస్యలే. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. బరువు ఇబ్బందులు కూడా చూస్తారు. రోజంతా అలసటగా అనిపిస్తుంది.

yearly horoscope entry point

ఒత్తిడి తగ్గాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వారు చాలా మంది ఉన్నారు. ఫలితంగా మరుసటి రోజు పని చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, రాత్రి నిద్రపోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో వేడిని నియంత్రించడానికి మీకు మార్గం లేదు. కానీ ఇతర చిట్కాలు ఉన్నాయి. ఆ విషయంలో ఇక్కడ కొన్ని టిప్ప్ మీకోసం ఇచ్చాం..

బ్రష్ చేయండి

రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా బ్రష్ చేయండి. మీ చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇష్టమైన నైట్ క్రీమ్‌ను మీ ముఖంపై రాయండి. ఇవి మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అలాగే డైరీ రాయడానికి ఇష్టపడితే రాత్రి పడుకునే ముందు రాసుకోవచ్చు. ఇది మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. మీరు రాత్రి బాగా నిద్రపోతారు.

వ్యాయామం చేయాలి

అలాగే పడుకునే ముందు కనీసం 10 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది. తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. మీరు ఇంట్లో కూడా నడవవచ్చు. కానీ గుర్తుంచుకోండి, రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇది శరీరం నుండి మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.

తేలికపాటి భోజనం

మంచి నిద్ర కోసం ఎల్లప్పుడూ తేలికపాటి భోజనం తీసుకోండి. పడుకునే ముందు కనీసం మూడు నుండి నాలుగు గంటల ముందు తినడానికి ప్రయత్నించండి. రాత్రిపూట చక్కెర, అధిక కొవ్వు లేదా కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎప్పుడూ తినవద్దు. నిద్రపోయే ముందు ధూమపానం చేయవద్దు. నిద్ర తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు పాలు లేదా అరటిపండు తినవచ్చు. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది.

అరగంట కంటే ఎక్కువ నిద్రించొద్దు

మధ్యాహ్నం వేళ ఎంత అలసిపోయినా అరగంటకు మించి నిద్రపోకండి. ఆ నిద్ర సాయంత్రం 4 గంటలకు ముందు ఉండాలి. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి పడుకోండి. ఇది మీకు బాగా నిద్రపోయేలా చేస్తుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నీళ్లు తాగండి.

ఇంటి గోడలు తడపండి

చాలా మంది వేడి కారణంగా నిద్ర సమస్యలు ఎదుర్కొంటారు. అయితే సాయంత్రపూట ఇంటి గోడలను నీటితో తడపండి. వీలైతే ఇంట్లో కూడా నీటిని చల్లండి. కిటికీలు తెరిచి ఉంచండి. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వాతావరణం చల్లబడుతుంది. పడుకోవడానికి ఓ గంట ముందు స్నానం చేయండి. కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.

Whats_app_banner