Faster Hair Growth Tips । జుట్టు వేగంగా పెరగాలా? ఇవిగో చిట్కాలు!
07 June 2023, 11:56 IST
- Faster Hair Growth Tips: జుట్టు వేగంగా పెరిగేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. వీటిని అనుసరించడం ద్వారా జుట్టు వేగంగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది.
Faster Hair Growth Tips:
Faster Hair Growth Tips: చిన్నప్పుడు అందరికీ తలపై జుట్టు ఉంటుంది, కానీ పెద్దయ్యాక కొందరికి మాత్రమే జుట్టు ఉంటుంది. కొందరికి తక్కువ జుట్టు, కొందరికి ఎక్కువ జుట్టు అనే అసమానతలు ఉంటాయి. సాధారణంగా ఒక వ్యక్తికి తలపై సుమారుగా 1 లక్ష వెంట్రుక పోచలను కలిగి ఉంటారని అంచనా. అయితే వయసు ప్రభావం, జుట్టు రకం, సరైన జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, అనారోగ్య సమస్యలు మొదలైన కారణాల వలన జుట్టు రాలిపోవడం జరుగుతుంది, ఇది ఇలాగే కొనసాగితే బట్టతలకు కారణం అవుతుంది. రాలిన జుట్టు మళ్లీ రావటానికి చాలా కాలం పట్టవచ్చు, లేదా అసలే రాకపోవచ్చు. అయితే కొన్ని సంరక్షణ చర్యల ద్వారా కోల్పోయిన జుట్టును తిరిగి పొందవచ్చు.
జుట్టు వేగంగా పెరిగేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. వీటిని అనుసరించడం ద్వారా జుట్టు వేగంగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది. అయితే దీని ఉద్దేశ్యం రాత్రికి రాత్రే మీ జుట్టు పెరిగిపోదు. వివిధ దశలలో పెరుగుతుంది. జుట్టు వేగంగా పెరగటానికి మీరు అనుసరించాల్సిన మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
విటమిన్లు, ఖనిజాలతో పోషణ
మీ జుట్టు పెరగడానికి మీ శరీరానికి చాలా శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి కేలరీలు తక్కువ తీసుకోవడం, సరిగ్గా ఆహారం చేయకపోవడం వలన పోషకాల లోపం ఏర్పడి అది జుట్టు పెరుగుదలను ప్రభావితం కావచ్చు. కాబట్టి మీ జుట్టు పెరగాలంటే మీ శరీరానికి చాలా పోషకాలను అందివ్వాల్సి ఉంటుంది. ఆహారానికి అదనంగా కొన్ని సప్లిమెంట్లను తీసుకోవడాన్ని కూడా పరిగణించాలి. ప్రత్యేకించి ఒమేగా-3, జింక్, ఐరన్, బయోటిన్ (విటమిన్ బి7), విటమిన్ సి, విటమిన్ డి, ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి.
జుట్టుకు ఎసెన్షియల్ ఆయిల్స్ వర్తించండి
జుట్టు పెరుగుదలకు సాధారణ నూనెలతో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ వర్తించండి. లావెండర్, చామంతి, థైమ్, పుదీనా, వెల్లుల్లి నూనెలను వర్తించండి. అయితే ఈ నూనెలు మీ జుట్టుకు నేరుగా అప్లై చేయకుండా ఏదైనా క్యారియర్ ఆయిల్‌లో కలిపి వర్తించాలి. కొబ్బరినూనె లేదా పొద్దుతిరుగుడు నూనె, ఆముదం నూనెలలో కలిపి ఉపయోగించాలి. ఉదాహరణకు 30 మిల్లీలీటర్ల కొబ్బరినూనెలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలకు వర్తించాలి. అలాగే మీ షాంపూలో టీ ట్రీ ఆయిల్, జోజోబా ఆయిల్, రోజ్మేరీ లేదా లైమ్ ఆయిల్ కొన్ని చుక్కలను కలిపి ఉపయోగించాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
జుట్టుకు ఆయింట్మెంట్
జుట్టుకు వర్తించటానికి కొన్ని రకాల ఆయింట్మెంట్లు ఉంటాయని మీకు తెలుసా? జుట్టు రాలడం నివారించటానికి, జుట్టు పెరగడానికి ఈ ఆయింట్మెంట్లు సహాయపడతాయి. ఉదాహరణకు మెలటోనిన్ ఆయింట్మెంట్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అనాజెన్ జుట్టు పెరుగుదల చక్రాన్ని పెంచుతుంది. మినాక్సిడిల్ ఆయింట్మెంట్ 3 నుండి 6 నెలల వరకు ప్రతిరోజూ ఉపయోగించినప్పుడు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, బట్టతలను కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతాయి.
కెరాటిన్ చికిత్స
జుట్టు రాలడం అనేది ప్రోటీన్ లోపం వలన తలెత్తుతుంది, కాబట్టి సరైన ప్రోటీన్ పోషణ అవసరం, కెరాటిన్‌తో సహా ఇతర ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కెరాటిన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, దెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేస్తుంది.
కుదుళ్లకు కెఫిన్ చికిత్స
కెఫీన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అధ్యయనాలు తెలిపాయి, కెఫీన్ హెయిర్ ఫోలికల్ సంఖ్యను పెంచుతుంది. హెయిర్ గ్రోత్ ప్రమోటర్‌గా ఉంటుంది. కెఫీన్‌తో కూడిన జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడవచ్చు.