Sugar Cane Juice । చెరుకు రసం తాగటం కాదు.. మీ ముఖం, జుట్టుకు అప్లై చేసి చూడండి!
Sugar Cane Juice for skin and hair: చెరుకు రసం తాగటమే కాదు, దీనిని చర్మానికి లేదా తలకు కూడా అప్లై చేయవచ్చు. ఈ రసాన్ని చర్మానికి, జుట్టుకు అప్లై చేయడం ద్వారా మీ అందాన్ని మెరుగుపరుస్తుందని మీకు తెలుసా?
Sugar Cane Juice Benefits: వేసవిలో లభ్యమయ్యే అత్యంత రిఫ్రెష్ పానీయాలలో చెరకు రసం ఒకటి. చెరుకు రసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసు. మండుటెండలో ఒక గ్లాసు చెరుకు రసం తాగితే దాహం తీరడమే కాకుండా, వెంటనే శక్తిని లభిస్తుంది, ఈ రసం జీర్ణవ్యవస్థ సులభతరం చేస్తుంది, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఐరన్, కార్బోహైడ్రేట్లు, జింక్ వంటి అనేక ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండే ఈ నేచురల్ జ్యూస్ సహజమైన తియ్యటి రుచిని కలిగి మనసును తృప్తిపరుస్తుంది.
అయితే చెరుకు రసం తాగటమే కాదు, దీనిని చర్మానికి లేదా తలకు కూడా అప్లై చేయవచ్చు. ఈ రసాన్ని చర్మానికి, జుట్టుకు అప్లై చేయడం ద్వారా మీ అందాన్ని మెరుగుపరుస్తుందని మీకు తెలుసా? చెరుకు రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఇతరముఖ్యమైన పోషకాలు మీ చర్మానికి, జుట్టుకు బలమైన పోషణ అందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంతో పాటు వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తాయి.
చెరకు రసాన్ని చర్మం (Sugar Cane Juice for Skin) మీద అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలను నయం చేస్తుంది
చెరకు రసం చర్మానికి రాయడం వలన మొటిమలను నయం చేయవచ్చు. ఎందుకంటే చెరకు రసంలో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్‌లు, గ్లైకోలిక్ యాసిడ్ వంటివి ఉండటం వల్ల కొత్తకణాల నిర్మాణంలో సహాయపడుతుంది. ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు మన చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, మన చర్మ రంధ్రాలలో ధూళి పేరుకుపోకుండా నిరోధిస్తుంది తద్వారా మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.
అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
చెరకురసం అనేక పోషకాలకి సహజ మూలం. విటమిన్లు, ఖనిజాలతో పాటు, ఇది పాలీఫెనాల్స్, అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. వీటిలో కొన్ని యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచతుంది. చర్మంపై ముడతలను నివారించి వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది.
మాయిశ్చరైజ్ చేస్తుంది
చెరకు రసం చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్. ఇందులోని అధిక గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్ తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, పొడిబారకుండా చేస్తుంది. రెగ్యులర్ అప్లికేషన్ ద్వారా చర్మంపై పగుళ్లు, డల్‌నెస్, రఫ్ ప్యాచ్‌ల వంటి సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
చెరుకు రసం ముఖానికి ఎలా అప్లై చేయాలి?
మీ ముఖంను నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత చెరకు రసాన్ని కాటన్ బాల్‌తో మీ ముఖంపై రాయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేసుకోండి, ఆపై మెత్తని టవల్ తో శుభ్రంగా తుడవండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ రసాన్ని వారానికి కనీసం మూడుసార్లు అప్లై చేయండి
చెరకు రసాన్ని జుట్టు (Sugar Cane Juice for Hair) మీద అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
జుట్టు పెరుగుదలను పెంచుతుంది
చెరకు రసంలో విటమిన్ B12, విటమిన్ A, విటమిన్ C లతో పాటు జింక్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు మన హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి, వాటిని పునరుజ్జీవింపజేయడానికి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
డ్రై స్కాల్ప్‌కి చికిత్స చేస్తుంది
చెరకు రసంలోని తేమ, హైడ్రేటింగ్ లక్షణాలు పొడి తలకు అద్భుతమైన చికిత్సగా చెప్పవచ్చు. చెరకు రసంను తలకు అప్లై చేసినప్పుడు అవసరమైన పోషకాలతో తలలోని చర్మానికి అందుతాయి. ఇది ఆ ప్రాంతాన్ని రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. గ్లైకోలిక్ యాసిడ్ స్కాల్ప్ బిల్డప్‌ను తొలగించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
చెరుకు రసం జుట్టుకు ఎలా అప్లై చేయాలి?
జుట్టు కండిషనింగ్ ప్రయోజనాల కోసం మీరు చెరుకు రసాన్ని జుట్టుకు పైపైన పూయండి, కురులకు రసం పూసిన తర్వాత సుమారు 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
ఇవి మాత్రమే కాదు చెరకు రసం నోటి దుర్వాసన, దంత క్షయం వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చెరకు రసంలోని కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పంటి ఎనామిల్ ను, ఎముకలను బలోపేతం చేస్తాయి.
సంబంధిత కథనం