తెలుగు న్యూస్  /  Lifestyle  /  Churumuri Snacks Aa Simple Yet Delicious Tea Time Recipe For The Boring Evenings

Churumuri Recipe । కరకరలాడే చురుమురి.. సాయంత్రం వేళ టైంపాస్ చిరుతిండి!

HT Telugu Desk HT Telugu

02 June 2023, 17:42 IST

    • Churumuri Snacks Recipe:  చురుమురిఅనేది ఒక సాధారణ చిరుతిండి, ఇది ఆరోగ్యకరమైనది కూడా.  ఈ చిరుతిండిని క్షణాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఎలా చేయాలో కింద సూచనలు చదవండి.
Churumuri Snacks Recipe
Churumuri Snacks Recipe (unsplash)

Churumuri Snacks Recipe

Tea Time Snacks Recipes: సాయంత్రం వేళ స్నాక్స్ తినాలనిపించినపుడు, ఏదో శ్రమతో కూడిన వంటకం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సింపుల్ చిరుతిళ్ళు కూడా మనసుకు తృప్తిని ఇస్తాయి. ఈ జాబితాలో చురుమురి కూడా ఒకటి. చురుమురి అంటే మసాలా మిక్స్ చేసిన మరమరాళ్లు అని అర్థం. మీరు కూడా చాలా సార్లు మరమరాళ్లు లేదా ప్యాలాలతో కేవలం కొద్దిగా కారం, కొన్ని ఉల్లిపాయలు కలుపుకొని తిని ఉంటారు. ఈ సులభమైన రెసిపీని కూడా మీరు చాలా ఇష్టపడే వారు. ఇప్పుడు ఈ చురుమురి రెసిపీ కూడా అలాంటిదే.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Friday Motivation: జీవితంలో సమస్యలు ఎప్పటికీ పోవు, వాటి గురించి మర్చిపోయి ఉన్న ఒక్క జిందగీ ఆస్వాదించండి

Chicken Recipe: దాబా స్టైల్‌లో చికెన్ కర్రీ ఇలా వండితే గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది

చురుమురి (churumuri) అనేది ఒక సాధారణ చిరుతిండి, ఈ రెసిపీని మరమరాళ్లతో కొన్ని సాధారణ పదార్థాలు కలిపి చేస్తారు.ఇది కొద్దిగా కారంగా, పులుపు, వగరుగా ఉంటుంది. సాయంత్రం వేళ టైంపాస్ రెసిపీగా ఉంటుంది. ఈ చిరుతిండిని క్షణాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఎలా చేయాలో కింద సూచనలు చదవండి.

Puffed Rice Snacks Recipe కోసం కావలసినవి

  • 3 కప్పులు మరమరాళ్లు
  • 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది
  • 1 టొమాటో సన్నగా తరిగినది
  • 1 పచ్చిమిర్చి
  • ½ టీస్పూన్ కారం పొడి
  • 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు సన్నగా తరిగిన
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
  • 3 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగ
  • 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి
  • ¼ టీస్పూన్ జీలకర్ర

చురుమురిని ఎలా తయారు చేయాలి

  1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మరమరాళ్లు తీసుకోండి.
  2. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు, టమోటాలు వేయండి.
  3. ఆపైన కొద్దిగా నూనె లేదా నెయ్యి చల్లండి.
  4. తర్వాత ఉప్పు, కారం, నిమ్మరసం చల్లుకోండి.
  5. పైనుంచి కొత్తిమీర తరుగు, వేయించిన వేరుశనగలు వేయాలి, కరకరలాడేందుకు కొద్దిగా బూందీ కూడా చల్లుకోవచ్చు.
  6. అన్నింటిని బాగా కలిపేస్తే చురుమురి రెడీ.

హాయిగా తింటూ ఆస్వాదించండి, ఒక గ్లాస్ టీ లేదా కాఫీని సిప్ చేయండి.