తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oil-free Snacks । మీరు డైట్‌లో ఉన్నా.. ఈ చిరుతిళ్లను నీట్‌గా తినేయొచ్చు!

Oil-free Snacks । మీరు డైట్‌లో ఉన్నా.. ఈ చిరుతిళ్లను నీట్‌గా తినేయొచ్చు!

HT Telugu Desk HT Telugu

02 November 2022, 17:23 IST

    • Oil-free Snacks: మీకు చిరుతిళ్లు అంటే ఇష్టం ఉన్నా, బరువు తగ్గే ఆలోచనలతో తినకుండా విరమించుకుంటున్నారా? ఇక్కడ కొన్ని రకాల స్నాక్స్ లిస్ట్ ఇచ్చాం. ఇవి పూర్తిగా నూనె రహితమైనవి, ఆరోగ్యకరమైనవి బరువు నియంత్రణలోనే ఉంటుంది. ట్రై చేయండి.
Oil-free Snacks-
Oil-free Snacks-

Oil-free Snacks-

బరువు తగ్గడానికి డైటింగ్ చేసేవారు కచ్చితమైన ఆహార నియమాలు పాటించినపుడే ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా చిరుతిళ్లు మానేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా చాలా మంది కచ్చితమైన డైట్ పాటిస్తారు కూడా. తమకు ఎంతో ఇష్టమైన ఆహారాలను త్యాగం చేస్తారు, తమ ఆహార కోరికలను చంపుకుంటారు. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచ ఉన్నవారు తమ గ్లామర్, మంచి ఫిజిక్ కోసం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కనీసం సాయంత్రం వేళ టీతో పాటుగా స్నాక్స్ తినాలనిపించినా తినలేరు.

మీరూ ఈ జాబితాలో ఉంటే ఇప్పుడు చింతించకండి. మీ డైట్‌కు ఎలాంటి ఇబ్బంది లేని ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి పూర్తిగా నూనె రహితమైనవి, రుచికరమైనవి, మీరు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండేలా ఇవి ఉపయోగపడతాయి.

Oil-free Snacks- నూనె పదార్థం లేని స్నాక్స్

బరువు తగ్గాలనుకునే వారు, డైట్ పాటించే వారు ఈ కింద పేర్కొన్న చిరుతిళ్లను తినవచ్చు. ఇవి నూనె రహితమైనవి లేదా అతితక్కువ మోతాదులో నూనె ఉపయోగించినవి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికోసం ప్రత్యేకంగా నిపుణులు సూచించిన స్నాక్స్.

మఖానా:

వీటిని తామర గింజలు (Fox Nuts), మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. ఇవి చాలా రుచికరమైన చిరుతిళ్లుగా ఉంటాయి, టీటైంలో మంచి స్నాక్స్ అని చెప్పవచ్చు. ఇందులో పెస్టిసైడ్స్ కూడా ఉండవు, పుష్కలమైన ఔషధ గుణాలు ఉంటాయి.

కారామెలైజ్డ్ వేరుశెనగలు:

వీటిని కూడా ఎటువంటి నూనెను ఉపయోగించకుండా చేస్తారు. వేరుశెనగలను మంటపైనే వేయించి, కొద్దిగా గోధుమ రంగులోకి మారిన తర్వాత వివిధ రకాల మసాలా దినుసుల పాకంతో కలుపుతారు.

వేయించిన డ్రైఫ్రూట్స్:

జీడిపప్పు, బాదం, వేరుశనగ, పిస్తా మొదలైన డ్రై ఫ్రూట్‌లను, నట్‌లను నూనె ఉపయోగించకుండా వేయించి, ఆపై వాటిని మరింత రుచిగా చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులతో కలుపుతారు.

విత్తనాలు:

అవిసె, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు, పుచ్చకాయ, సోయాబీన్, నువ్వుల వంటివి నిరభ్యంతరంగా తినొచ్చు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడే విత్తనాల రకాలు. కొద్దిగా నల్ల ఉప్పు, మిరియాల పొడి కలిపితే ఇవి మరింత రుచిగా మారతాయి. వీటిని చిరుతిండిగా తీసుకోవచ్చు.

డైట్ చివ్డా:

అటుకుల గురించి ప్రత్యేకంగా చెప్పనకరలేదు. కరకరలాడేలా చేసుకునే అటుకులు ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి చాలా తేలికైనవి, బరువు నియంత్రణలో సహాయపడతాయి.

ఈ స్నాక్స్ తింటూ మీ టీ టైమ్ ను ఆస్వాదించండి, ఆనందగా బరువు తగ్గండి, ఆరోగ్యంగా ఉండండి.

టాపిక్