తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Snacks: ఆరోగ్యకరమైన చిరుతిళ్లు.. ఇంట్లోనే చేసుకోండి

healthy snacks: ఆరోగ్యకరమైన చిరుతిళ్లు.. ఇంట్లోనే చేసుకోండి

31 October 2023, 19:11 IST

google News
  • healthy snacks: తక్కువ సమయంలో చేసుకోగలిగే కొన్ని సులభమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏంటో చూద్దాం. 

ఆరోగ్యకరమైన చిరుతిళ్లు
ఆరోగ్యకరమైన చిరుతిళ్లు (Pinterest)

ఆరోగ్యకరమైన చిరుతిళ్లు

ఆఫీసు కెళ్లే వాళ్లకి, స్కూలు కెళ్లే పిల్లల బాక్సుల్లోకి సులభంగా చేసివ్వగల స్నాక్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఈ మదర్స్ డే రోజున ప్రత్యేకంగా మీ అమ్మకి కూడా చేసి పెట్టొచ్చు. ముఖ్యంగా ఆఫీసుకెళ్లేవాళ్లకి ఈ స్నాక్స్ చేసివ్వండి. సాయంత్రం పూట ఉండే చిరు ఆకలిని తీరుస్తాయివి.

1.ఫూల్ మఖానా:

దీంట్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మామూలుగా వేటిని నేరుగా లేదా వేయించుకుని తొనొచ్చు. కాస్త మార్పు చేసి ఎలా మంచి స్నాక్ చేయాలో చూడండి.

కావాల్సిన పదార్థాలు:

మఖానా - 30 గ్రాములు

పల్లీలు - 1 టేబుల్ స్పూన్

నెయ్యి - 1 టీస్పూను

క్యారట్ తురుము - 2 టేబుల్ స్పూన్లు

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - తగినంత

తయారీ విధానం:

ఒక ప్యాన్ లో నెయ్యి వేడి చేసి ఉల్లి పాయ ముక్కలు వేయండి.

అవి రంగు మారాక, పల్లీలు, మఖానా కూడా వేసేయండి. క్యారట్ తురుము, ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపి వేరే గిన్నె లోకి తీసుకోండి.

2. మిక్స్చర్:

ఇది చేయడం చాలా సులభం. ఐదారు బాదాం గింజలు, నాలుగైదు వాల్‌నట్స్, నాలుగు జీడిపప్పులు, నాలుగైదు ఎండు ద్రాక్ష్, కొన్ని సన్ ఫ్లవర్ గింజలు, కొన్ని పుచ్చకాయ గింజలు తీసుకోండి. వీటన్నింటిని ఒక డబ్బాలో వేసి కొంచెం ఉప్పు, మీకు నచ్చిన హర్బ్స్ ఏవైనా వేసుకోవచ్చు.

3.శనగలతో హమ్మస్:

హమ్మస్ విదేశాల్లో చాలా ప్రాచుర్యం చెందిన ఒక సైడ్ డిష్. ఒక రకమైన చట్నీ లాంటిది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువే. కావాల్సిన పదార్థాలు కూడా కొన్నే. ముందుగా శనగలను నానబెట్టి ఉడికించుకోవాలి. వేయించిన నువ్వులను మిక్సీలో పట్టుకోవాలి . దీంట్లోనే నిమ్మరసం, ఆలివ్ నూనె, ఉప్పు, ఉడికించిన శనగలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే హమ్మస్ సిద్ధం. దీన్ని గాలి చొరని డబ్బాలో భద్రపరుచుకోండి. ఉడికించిన కూరగాయలతో, చిప్స్, కాక్రా, చపాతీ, బ్రెడ్ లాంటి వాటికి ఇది పెట్టుకుని తినొచ్చు.

4.వేయించిన శనగలు:

శనగలను ఉప్పు నీళ్లలో కనీసం 8 గంటలు నానబెట్టి నూనె లేకుండా వేయించాలి. వీటిమీద ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పల్లీలు వేసుకుని స్నాక్ లాగా తినొచ్చు. లేదా కొద్దిగా నూనె వేసుకుని నానబెట్టిన శనగలను వేయించుకుని ఉప్పు, కారం వేసుకున్నా స్నాక్ లాగా తినడానికి బాగుంటుంది.

 

తదుపరి వ్యాసం