Diabetes-friendly Sweets । చక్కెర లేకుండా స్వీట్స్, స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు!-7 ways to make your desserts diabetesfriendly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  7 Ways To Make Your Desserts Diabetes-friendly

Diabetes-friendly Sweets । చక్కెర లేకుండా స్వీట్స్, స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు!

Mar 07, 2023, 07:43 PM IST HT Telugu Desk
Mar 07, 2023, 07:43 PM , IST

  • Diabetes-friendly Sweets: ఇది వేడుకల సమయం, ఈ సందర్భంలో నోరు తీపిచేసుకోవడం సాంప్రదాయం. కానీ మీరు డయాబెటిస్ డైట్ అనుసరిస్తుంటే, చక్కెర లేకుండా మధురమైన స్వీట్స్ చేసుకోవడానికి మార్గాలు చూడండి..

 మళ్ళీ వరుసగా పండుగలు, వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో  స్వీట్లు తినేముందు చక్కెరను తగ్గించాలంటే,  అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. , ఆరోగ్య వరల్డ్‌ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ మేఘనా పాసి ఆ చిట్కాలు సూచించారు. 

(1 / 8)

 మళ్ళీ వరుసగా పండుగలు, వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో  స్వీట్లు తినేముందు చక్కెరను తగ్గించాలంటే,  అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. , ఆరోగ్య వరల్డ్‌ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ మేఘనా పాసి ఆ చిట్కాలు సూచించారు. (HT File photo)

ఫైబర్, పోషక పదార్ధాలను పెంచడానికి మైదా స్థానంలో  గోధుమ పిండి, ఇతర మిల్లెట్ పిండిని కలిపి స్వీట్లు చేయండి.  

(2 / 8)

ఫైబర్, పోషక పదార్ధాలను పెంచడానికి మైదా స్థానంలో  గోధుమ పిండి, ఇతర మిల్లెట్ పిండిని కలిపి స్వీట్లు చేయండి.  (Pinterest)

మీ గుండెకు అనుకూలమైన కొవ్వులను పెంచడానికి అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం, వాల్‌నట్‌లు, నువ్వుల గింజలను మీ చిరుతిళ్లలో చేర్చండి.  

(3 / 8)

మీ గుండెకు అనుకూలమైన కొవ్వులను పెంచడానికి అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం, వాల్‌నట్‌లు, నువ్వుల గింజలను మీ చిరుతిళ్లలో చేర్చండి.  (Pinterest)

శుద్ధి చేసిన చక్కెరలను పండ్ల గుజ్జు, ఖర్జూరం, అత్తి పండ్లను, తేనె, ఎండుద్రాక్షలతో భర్తీ చేయండి. ఆరెంజ్ ఓట్స్ రబ్డీ, కొబ్బరి-డ్రై ఫ్రూట్ గర్జలు, యాపిల్ పాన్‌కేక్‌లు,క్యారెట్ హల్వా, యాపిల్ ఖీర్ వంటివి తీసుకోవచ్చు.

(4 / 8)

శుద్ధి చేసిన చక్కెరలను పండ్ల గుజ్జు, ఖర్జూరం, అత్తి పండ్లను, తేనె, ఎండుద్రాక్షలతో భర్తీ చేయండి. ఆరెంజ్ ఓట్స్ రబ్డీ, కొబ్బరి-డ్రై ఫ్రూట్ గర్జలు, యాపిల్ పాన్‌కేక్‌లు,క్యారెట్ హల్వా, యాపిల్ ఖీర్ వంటివి తీసుకోవచ్చు.(pinterest)

మీ డెజర్ట్‌లలో తీపి కోసం పంచదారకు బదులు దాల్చిన చెక్క, ఏలకులు, కుంకుమపువ్వు,  జాజికాయ కలపండి.

(5 / 8)

మీ డెజర్ట్‌లలో తీపి కోసం పంచదారకు బదులు దాల్చిన చెక్క, ఏలకులు, కుంకుమపువ్వు,  జాజికాయ కలపండి.(Shutterstock)

బేకరీల నుండి కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోండి. ఇది చక్కెరలను మాత్రమే కాకుండా హైడ్రోజనేటెడ్ ఆయిల్/డాల్డా/వనస్పతి నూనెను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది, మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

(6 / 8)

బేకరీల నుండి కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోండి. ఇది చక్కెరలను మాత్రమే కాకుండా హైడ్రోజనేటెడ్ ఆయిల్/డాల్డా/వనస్పతి నూనెను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది, మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  (Pinterest)

డార్క్ చాక్లెట్‌లో తక్కువ చక్కెర ఉన్నందున మిల్క్ చాక్లెట్‌కు బదులుగా అధిక నాణ్యత గల డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోండి.

(7 / 8)

డార్క్ చాక్లెట్‌లో తక్కువ చక్కెర ఉన్నందున మిల్క్ చాక్లెట్‌కు బదులుగా అధిక నాణ్యత గల డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోండి.(Unsplash (Merve Aydın))

 నూనె మొత్తాన్ని తగ్గించడానికి డీప్ ఫ్రైయింగ్ స్థానంలో వేయించడం, కాల్చడం, ఆవిరి చేయడం లేదా గ్రిల్ చేయడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించి ప్రయత్నించండి.

(8 / 8)

 నూనె మొత్తాన్ని తగ్గించడానికి డీప్ ఫ్రైయింగ్ స్థానంలో వేయించడం, కాల్చడం, ఆవిరి చేయడం లేదా గ్రిల్ చేయడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించి ప్రయత్నించండి.(Unspalsh)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు