తెలుగు న్యూస్  /  Lifestyle  /  Beat Blood Sugar With Bitter Here Is Healthy Bitter Gourd Paratha Breakfast Recipe

Bitter Gourd Paratha | బ్రేక్‌ఫాస్ట్‌లో తినండి కాకరకాయ పరాటా.. వ్యాధులకు చెప్పండి టాటా!

HT Telugu Desk HT Telugu

01 June 2023, 6:30 IST

    • Bitter Gourd Parata Recipe: అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కాకరకాయ తినడం చాలా మంచిది. ఇక్కడ కాకరకాయతో చేసే కాకరకాయ పరాటా రెసిపీని అందిస్తున్నాం. ఇది మీకు ఉదయం ఆరోగ్యకరమైన ఆల్పాహారం అవుతుంది.
Bitter Gourd Paratha Breakfast
Bitter Gourd Paratha Breakfast (Unsplash)

Bitter Gourd Paratha Breakfast

Healthy Breakfast Recipes: ఉదయం చేసే అల్పాహారం రోజులో చేసే అతి ముఖ్యమైన భోజనంగా చెప్తారు. రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండాలన్నా, జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా అస్సలు ఉండకూడదు. అంతేకాదు మీరు చేసే బ్రేక్‌ఫాస్ట్‌ ఆరోగ్యకరమైనదిగా, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు నిండినదై ఉండాలి. మీకు ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నట్లయితే ఆహారం విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.

ముఖ్యంగా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, PCOD, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి వారు తినే ఆహారం విషయంలో పరిమితులు ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లేదా షుగర్ స్థాయిలు పెరగకుండా ఉండటానికి వారు తమ ఆహారంను జాగ్రత్తగా ఎంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలను తినడం ద్వారా వీరు తమ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. పైన చెప్పిన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కాకరకాయ తినడం చాలా మంచిది. ఇక్కడ కాకరకాయతో చేసే కాకరకాయ పరాటా రెసిపీని అందిస్తున్నాం. ఇది మీకు ఉదయం ఆరోగ్యకరమైన ఆల్పాహారం అవుతుంది.

Bitter Gourd Paratha Recipe కోసం కావలసినవి

  • 2 కాకరకాయలు
  • 1 టీస్పూన్ శనగపిండి
  • 1 కప్పు పిండి
  • 1 టీస్పూన్ అవిసె గింజలు
  • 1 టీస్పూన్ ఓట్స్,
  • 1 పచ్చిమిర్చి
  • 1/2 ఉల్లిపాయ
  • రుచికి తగినంత ఉప్పు
  • తాజా కొత్తిమీర

కాకరకాయ పరాటా తయారీ విధానం

  1. ముందుగా కాకరకాయలను కడిగి చిన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి, గింజలను తీసేయాలి. ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసుకోవాలి.
  2. కాకరకాయల ముక్కలను నీటిలో ఉడకబెట్టి మెత్తగా చేయాలి
  3. అనంతరం మెత్తగా చేసిన కాకరకాయలతో పాటు పైన పేర్కొన్న పదార్థాలన్నింటిని పిండిలో వేసి బాగా కలపాలి. ఆపై చిన్నచిన్న పిండి ముద్దలుగా చేసుకోవాలి.
  4. ఇప్పుడు పైనంపై నూనె వేడి చేసి పరాటాగా కాల్చుకోవాలి. 10 నిమిషాల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి.
  5. అంతే, కాకరకాయ పరాటా రెడీ. వేడివేడిగా తింటూ ఆస్వాదించండి.

Health Benefits: ఈ కాకరకాయ పరాటాను డయాబెటిస్‌ కలిగిన వారు కూడా హాయిగా తినవచ్చు, ఇది తక్కువ కొవ్వు కలిగిన ఆహారం, బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల ఊబకాయం రాదు, శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. అలాగే, ఉదయం నుండి మీ జీవక్రియను పెంచుతుంది.

ఈ కాకరకాయ పరాటా మీ కడుపుకు కూడా ఆరోగ్యకరం. ఈ పరాటాలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు కడుపులోని పురుగులను చంపడంతో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తాయి.