తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jonna Buvva Breakfast । బలంగా తయారవ్వాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌గా జొన్న బువ్వ తినండి!

Jonna Buvva Breakfast । బలంగా తయారవ్వాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌గా జొన్న బువ్వ తినండి!

HT Telugu Desk HT Telugu

20 May 2023, 6:30 IST

    • Jonna Buvva : రాగి సంకటి చాలా సార్లు తినే ఉంటారు. మరి జొన్నసంకటి ఎప్పుడైనా తిన్నారా? ఉదయాన్నే ఒక కప్పు జొన్న బువ్వ తింటే ఎంతో ఆరోగ్యం. ఎలా చేయవచ్చో ఇక్కడ రెసిపీని చదవండి.
Jonna Buvva
Jonna Buvva (slurrp)

Jonna Buvva

Jonna Buvva : రాగి సంకటి లేదా రాగి ముద్ద అనేది ఎప్పుడూ తినేదే. ఎప్పుడైనా జొన్న బువ్వ లేదా జొన్న సంకటి (Jonna Sangati) తిని చూశారా? జొన్న బువ్వను జొన్నలతో తయారు చేస్తారు. జొన్నలు ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు అని మనందరికీ తెలుసు. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. జొన్నలలో ఫైబర్ ఎక్కువ ఉన్నందున ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహులకు ఎంతో ఆదర్శవంతమైన ఆహారం. .

ట్రెండింగ్ వార్తలు

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

జొన్నబువ్వ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ , డైటరీ ఫైబర్‌తో లోడ్ చేసిన ఆహారం. ఇది శరీర పెరుగుదల, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఆదర్శవంతమైన తృణధాన్యం. జొన్నలలో అపారమైన కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, వ్యాధులను దూరం చేస్తాయి. ఇంకా జొన్నబువ్వలో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అవసరమయ్యే విటమిన్లు థయామిన్, నియాసిన్, ఫోలేట్, రిబోఫ్లేవిన్‌లను కూడా కలిగి ఉంది. జొన్నబువ్వను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో వృద్ధాప్య ప్రక్రియకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనిలోని అధిక పోషకాల కూర్పు దీనిని సంపూర్ణమైన భోజనంగా మారుస్తుంది.

Jonna Buvva Recipe - జొన్నబువ్వను ఎలా చేయాలి?

జొన్నబువ్వ లేదా జొన్నసంగటి చేయడం చాలా సింపుల్. 1 కప్పు జొన్నలను తీసుకొని శుభ్రంగా కడిగి 10 నుంచి 12 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టిన జొన్నలను అరగంట పాటు ఒక గుడ్డలో ఆరబెట్టి ఆపైన గ్రైండర్లో వేసి ముతక పిండిగా రవ్వలాగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ రవ్వను నీటిలో ఉడికించాలి, చిటికెడు ఉప్పు వెసి కలుపుతూ ఉడికించుకోవాలి.

త్వరగా చేసుకోవాలంటే.. Instant Jonna Buvva Recipe

జొన్నలను కడిగి, రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఈ రవ్వను ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం ఒక బాణాలిలో నీరు మరిగించి, చిటికెడు ఉప్పువేసి అందులో నానబెట్టిన జొన్నరవ్వను వేసి కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి.

అంతే జొన్నబువ్వ రెడీ. ఇది చూడటానికి గోధుమ ఉప్మాను పోలి ఉంటుంది. జొన్నబువ్వను మీకు నచ్చిన కూర, పప్పు, పచ్చడి లేదా పెరుగు దేనితో అయినా తినవచ్చు. ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంగా, రాత్రి ఆహారంగా ఎప్పుడైనా తినవచ్చు.

తదుపరి వ్యాసం