Jonna Rotte for Breakfast । రోజూ జొన్నరొట్టె తినండి.. మీ ఆరోగ్యానికి ఢోకా లేదు!-this is why jowar is a great millet know health benefits and jonna rotte recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jonna Rotte For Breakfast । రోజూ జొన్నరొట్టె తినండి.. మీ ఆరోగ్యానికి ఢోకా లేదు!

Jonna Rotte for Breakfast । రోజూ జొన్నరొట్టె తినండి.. మీ ఆరోగ్యానికి ఢోకా లేదు!

HT Telugu Desk HT Telugu
May 12, 2023 06:30 AM IST

Jonna Rotte for Breakfast: జొన్నరొట్టె ఎంతో శక్తివంతమైన ఆహారం. జొన్నరొట్టెలు చేయడం చాలా సింపుల్. బయట చేసినవి కాకుండా ఇంట్లోనే చేసుకోండి. జొన్నరొట్టె రెసిపీ ఈ కింద ఉంది.

Jonna rotte
Jonna rotte (Unsplash)

Great Millet Health Benefits: జొన్నరొట్టె ఎంతో శక్తివంతమైన ఆహారం. ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లో గోధుమ రొట్టె కంటే జొన్నరొట్టెను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జొన్నలలో ఫైబర్ ఎక్కువ ఉన్నందున ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహులు తమ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాల్సిన ఆహారం ఇది.

జొన్న రొట్టెలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో వృద్ధాప్య ప్రక్రియకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనిలోని అధిక పోషకాల కూర్పు దీనిని సంపూర్ణమైన భోజనంగా, రోజు తీసుకోవడానికి ఉత్తమమైన మిల్లెట్‌గా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, విటమిన్లు B, E లతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

జొన్నరొట్టెలు చేయడం చాలా సింపుల్. బయట చేసినవి కాకుండా ఇంట్లోనే చేసుకోండి. జొన్నరొట్టె రెసిపీ ఈ కింద ఉంది.

Jonna Rotte Recipe కోసం కావలసినవి

  • జొన్న పిండి- 1 కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • నీరు - 1.25 కప్పు
  • గోధుమ పిండి - 1 tsp (ఐచ్ఛికం)
  • నూనె - 1 tsp

జొన్నరొట్టె తయారీ విధానం

  1. ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీటిని మరిగించండి. అందులో ఒక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నూనె వేయండి. .
  2. నీరు మరగటం ప్రారంభించినప్పుడు, అందులో 1 కప్పు జొన్న పిండి, 1 టీస్పూన్ గోధుమ పిండిని కలపండి. గోధుమ పిండి కలిపితే రొట్టెకు పగుళ్లు రావు.
  3. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఉడికిన పిండిని బాగా కలుపండి. మూతపెట్టి 10 నిమిషాలు ఉంచండి.
  4. అనంతరం ఒక ప్లేట్ లో పిండి తీసుకొని ముద్దగా చేయండి, ఆపై సమాన పరిమాణంలో రౌండ్ బాల్స్ చేయండి.
  5. ఒక ప్లేట్‌లో కొంచెం జొన్న పిండిని తీసుకోండి, రౌండ్ బాల్స్ ను పిండిలో ముంచి చపాతీలా గుండ్రంగా రోల్ చేయండి.
  6. పెనంపై వేసి కాల్చండి, రెండువైపులా సారిగే కాలేలా చూసుకోండి.

జొన్నరొట్టె రెడీ. మీకు నచ్చిన కర్రీ, పప్పు, వెల్లులి కారం దేనితోనైనా ఆస్వాదించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం