తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Upma : రాగి ఉప్మా ట్రై చేశారా? ఇలా చేసేయాలంతే..

Ragi Upma : రాగి ఉప్మా ట్రై చేశారా? ఇలా చేసేయాలంతే..

HT Telugu Desk HT Telugu

26 April 2023, 6:30 IST

google News
    • Ragi Upma For Breakfast : వారానికి ఒకసారి రాగులు తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి రాగులను అనేక రకాలుగా వండుకుని తినవచ్చు. రాగి దోసె, రాగి ఇడ్లీ, రాగి ఉప్మా తయారు చేసుకోవచ్చు.
రాగి ఉప్మా
రాగి ఉప్మా

రాగి ఉప్మా

రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులను పిండిలా చేసుకుని.. చపాతీలు, జావ చేసుకుంటారు. రాగులతో చాలా ఆరోగ్యం. కొత్త కొత్త వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా తీసుకునేందుకు రాగి ఉప్మాను తయారు చేయండి. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

కావాల్సిన పదార్థాలు

రాగి పిండి - 1 కప్పు, ఆవాలు - 1/2 tsp(టేబుల్ స్పూన్), జీలకర్ర - 1/2 tsp, నూనె - 2 tbsp, చిక్పీస్ - 1/2 tsp, పసుపు పొడి - చిటికెడు, శెనగపప్పు కొంచెం, పచ్చిమిర్చి - 2 (తరిగిన), ఉల్లిపాయలు - 1 ( సన్నగా తరిగినవి), టొమాటో - 1 (సన్నగా తరిగినవి), కరివేపాకు - చిటికెడు, కొత్తిమీర - చిటికెడు, ఉప్పు - అవసరమైనంత, నీరు - 2 కప్పులు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 స్పూన్‌ నూనె పోయాలి. వేడి అయిన తర్వాత రాగుల పిండిని వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత మరో కడాయి తీసి స్టవ్ మీద పెట్టాలి. అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, మిగిలినవి వేసుకుని వేయించాలి. టొమాటోలు వేసి కొంచెం ఉప్పు చల్లి మెత్తగా వేయించాలి. తర్వాత అందులో నీళ్లు పోసి నిదానంగా రాగుల పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు తక్కువ మంట మీద నీళ్లు ఆరిపోయే వరకు ఉడకనివ్వాలి. నీళ్ళు పూర్తిగా ఆరిపోయాక అందులో నిమ్మరసం, కొత్తిమీర చల్లి దింపితే రాగి ఉప్మా రెడీ.

రాగులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. బరువు తగ్గడంలో, షుగర్ ను అదుపులో ఉంచేందుకు, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం, ఎముకలను బలంగా చేయడం, రక్తహీనత సమస్యను బయటపడేసేందుకు రాగులు ఉపయోగపడతాయి. ఉదయం పూట తీసుకుంటే.. స్ట్రాంగ్ అవుతారు. రోజూ రాగి జావ తీసుకోలేని వారు.. అల్పాహారంగా తయారు చేసుకోవచ్చు. రాగిపిండితో చేసుకునే వాటిల్లో రాగి ఉప్మా కూడా కూడా ఒకటి. చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ.

తదుపరి వ్యాసం