Bitter Truth । కాకరకాయతో పాటు వాటిని తినకూడదు.. చేదు నిజం అదే!-avoid eating these foods with bitter gourd know the bitter truth here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Avoid Eating These Foods With Bitter Gourd, Know The Bitter Truth Here

Bitter Truth । కాకరకాయతో పాటు వాటిని తినకూడదు.. చేదు నిజం అదే!

HT Telugu Desk HT Telugu
Dec 13, 2022 07:28 PM IST

Bitter Truth: కాకరకాయ తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ కాకరకాయ తినేటపుడు కొన్ని ఆహారాలను నివారించాలి. వేటిని నివారించాలి, కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

Bitter Gourd
Bitter Gourd (Pixabay )

Bitter Truth: భారతీయ పురాతన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారం అనే అంశం గురించి వివరణ ఉంటుంది. అంటే కొన్ని ఆహారాలు మంచి పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ, వాటిని ఇతర పదార్థాలతో కలిపి తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు దక్కవు. పైగా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని కూడా కలిగించే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని విరుద్ధ ఆహారం అంటారు, అలాంటి ఆహార పదార్థాలను విడిగానే తినాలి. పాలకూర- పనీర్ కలిపి తినకూడదు, తింటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో మీకు ఇది వరకే తెలియజేశాం. అలాగే చేపలను కూడా ఇతర కొన్ని మాంసాహారాలతో కలిపి తినకూడదు అంటారు. ఈ జాబితాలో కాకరకాయ కూడా ఉంది.

Avoid These Foods With Bitter Gourd - కాకరకాయతో ఈ ఆహారాలు వద్దు

అప్పుడప్పుడూ కాకరకాయ ఆహారంగా తప్పకుండా తీసుకోవాలి. కాకరకాయలోని చేదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, శరీరంలోని హానికర సూక్ష్మజీవులను సంహరిస్తుంది. అదే సమయంలో కాకరకాయ తిన్న తర్వాత మరికొన్నింటిని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. మరి తినకూడదు, తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకోండి.

పాలు తాగవద్దు

కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు. దీని వల్ల పొట్ట సమస్యలు తలెత్తవచ్చు. కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట వస్తుంది. కడుపు తిప్పినట్లు అవడం, వికారం వంటి సమస్యలు ఉండవచ్చు.

బెండకాయ తినవద్దు

కాకరకాయ తిన్న తర్వాత బెండకాయ వంటి కూరగాయలను తీసుకోకూడదు. కాకరకాయలోని చేదు, బెండకాయలోని జిగురు కలిసినపుడు అది జీర్ణం కావడం కష్టమవుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

మామిడికాయతో అనారోగ్యం

మామిడికాయను చేదు కాకరకాయతో కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుంది. దీని కారణంగా, మీకు వాంతులు, కడుపులో మంట, వికారం, అసిడిటీ వంటి సమస్యలు ఉండవచ్చు. ఇంకా ఈ రెండూ కూడా జీర్ణం కావడానికి చాలా సమయం పట్టవచ్చు.

ముల్లంగితో చేటు

చేదు కూరగాయ తిన్న తర్వాత ముల్లంగి లేదా ముల్లంగితో చేసిన ఆహారాలను తినవద్దు. ముల్లంగిలోని ఘాటు తనం, కాకరకాయలోని చేదు గుణం విభిన్న ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మీ గొంతులో ఆమ్లత్వం, కఫం కలిగిస్తుంది.

పెరుగుతో కష్టమే

కాకరకాయ కూరతో పెరుగు తినకూడదు. మీరు కాకరకాయ తిన్న తర్వాత పెరుగు తీసుకుంటే, మీకు చర్మంపై దద్దుర్లు సమస్య ఉండవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్