తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Balanced Diet : ఈ ఐదు పోషకాలు మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యమట..

Balanced Diet : ఈ ఐదు పోషకాలు మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యమట..

02 September 2022, 11:18 IST

    • Balanced Diet : మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయానికి వస్తే, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడమే మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన మొత్తంలో సరైన పోషకాలను పొందడం చాలా ముఖ్యం. అలాంటి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ఎలా ప్రారంభించవచ్చో, పోషకాహారాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
పోషకాహారం
పోషకాహారం

పోషకాహారం

Balanced Diet : వివిధ అధ్యయనాల ప్రకారం.. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిరూపించాయి. సాధారణ వ్యాయామంతో పాటు ఈ ఆహారం ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. పబ్‌మెడ్ సెంట్రల్‌లోని ఒక అధ్యయనంలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంగా మార్చడానికి మీ ఆహారంలో చేర్చవలసిన 5 పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

1. మంచి కొవ్వులు

అన్ని కొవ్వులు చెడ్డవి కావు. కాల్చినవి, వేయించనవి, పాల ఉత్పత్తులలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు హానికరమైనవి. కానీ కూరగాయల నూనెలు, గింజలు, తృణధాన్యాలు, చేపల నుంచి మోనోఅన్‌శాచురేటెడ్, బహుళ అసంతృప్త కొవ్వులు అందుతాయి. ముఖ్యంగా బహుళ అసంతృప్త ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగాలు. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి అవసరం. ఈ రెండు రకాల కొవ్వుల వినియోగం హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. కార్బోహైడ్రేట్లు

మనం తీసుకునే కార్బోహైడ్రేట్‌లో ఎక్కువ భాగం రోటీలు, బ్రెడ్‌ల నుంచి ఎక్కువ అందుతాయి. ఇవి అత్యంత ప్రాసెస్ చేసిన ధాన్యాల నుంచి తయారు చేస్తారు. కార్బోహైడ్రేట్ అవసరాలను తీర్చడానికి ఇవి ఆరోగ్యకరమైన ఎంపిక కాకపోవచ్చు. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, బీన్స్‌తో పాటు తృణధాన్యాల నుంచి తయారైన ఆహారాలు మంచివి. ఇవి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్‌లతో కూడిన నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను అందజేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

3. ప్రోటీన్

ప్రోటీన్ ఉత్పత్తిలో నిమగ్నమైన జీవక్రియ వ్యవస్థల విషయానికి వస్తే, అమైనో ఆమ్లాలు జంతు లేదా మొక్కల ప్రోటీన్ నుంచి వచ్చాయనేది అసంబద్ధం. కాబట్టి గుడ్లు, చికెన్, చేపలు లేదా కూరగాయలు, కాయధాన్యాలు, చిక్కుళ్లు ద్వారా.. ప్రోటీన్​ను మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

4. విటమిన్లు, ఖనిజాలు

కూరగాయలు, పండ్లు సమృద్ధిగా విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీ డైట్​లో పండ్లు, కూరగాయలు కలిపి తీసుకోవాలి. కానీ ఇటీవలి కాలంలో.. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి తర్వాత.. మన జీవనశైలిలో క్షీణత ఉంది. కాబట్టి విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి మొదలైన వాటికోసం కొన్ని విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

5. నీరు

మంచినీళ్లు శరీరానికి అవసరమైన వాటిలో చాలా ముఖ్యం. H2Oలో ఎలాంటి కేలరీలు ఉండవు. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం మంచిది. సోడాలు, పండ్ల పానీయాలు, జ్యూస్‌లు, స్పోర్ట్స్ డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి. చక్కెర పానీయాలు రోజు తీసుకుంటే.. బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, గట్ ప్రమాదాన్ని పెంచుతాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ పోషకాలను కలిపి తీసుకుంటే.. మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

టాపిక్