Weight Loss Tips: నెల రోజుల్లో బరువు తగ్గాలా? అయితే ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి!
28 August 2022, 18:21 IST
Weight loss meal plans:: బరువు తగ్గడం అంత తేలికైన విషయమేమి కాదు. దీనికి సరైన ప్రణాళిక ఉండాలి. త్వరగా బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగావేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సరైన డైట్ ప్లాన్ ఉండాలి.
Diet plan for weight loss
బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు, ఆహారం కూడా చాలా ముఖ్యం. త్వరగా బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగావేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇది కాకుండా, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి భోజన ప్రణాళికలను అనుసరించడం నెలలోనే తేడాను చూడవచ్చో తెలుసుకుందాం.
మీల్ ప్లాన్-1 -
బ్రెక్‌ఫాస్ట్: సాదారాణంగా అల్పాహారంతో డైట్ ప్లాన్ మెుదలవుతుంది. బరువు తగ్గాలనుకునే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట బిస్కెట్ల వంటి తీపి పదార్థాలకు బై చెప్పండిప అల్పాహారంలో పోహా, కూరగాయల గంజి లేదా ఉడికించిన గుడ్డు / ఆమ్లెట్ తీసుకోవాలి. మీకు టీ లేదా కాఫీ అలవాటు ఉన్నట్లయితే, చక్కెర లేని టీ. కాఫీని తీసుకోవడానికి ప్రయత్నించండి.
లంచ్ టైం: మధ్యాహ్న భోజనంలో పప్పు, బ్రౌన్ రైస్, రెండు రోటీలు, సలాడ్, పెరుగు తీసుకోవాలి. మీరు దీనికి ఏదైనా కాలానుగుణ కూరగాయలను కూడా జోడించవచ్చు.
డిన్నర్, స్నాక్స్: టీ విరామంలో, మీరు సమోసాలు లేదా నూడుల్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. మీరు చిలా, దాల్ వడ, రోస్ట్ వేరుశెనగ, ఆమ్లెట్ తినవచ్చు. రాత్రి భోజనంలో, లైట్ ఫుడ్ వెజిటబుల్ సూప్, గంజి, ఖిచ్డీని తీసుకోవచ్చు
మీల్ ప్లాన్-2
బ్రెక్‌ఫాస్ట్ - అల్పాహారంలో నానబెట్టిన గింజలను తినండి. దీని తర్వాత పనీర్ భుర్జీ, రెండు రోటీలు తినండి. గోధుమ రోటీ మాత్రమే కాకుండా మల్టీగ్రెయిన్ రోటీని తినాలి. దీని కోసం, గోధుమ పిండికి మిల్లెట్, శనగ పిండి వంటి పోషకమైన పదార్థాలను జోడించండి.
లంచ్: మధ్యాహ్న భోజనంలో మిక్స్ వెజ్, రోటీ, కూర, అన్నం, సలాడ్ తీసుకోవాలి.ఇది కాకుండా, మీరు పప్పు కూడా జోడించవచ్చు.మీరు ఫ్రూట్ సలాడ్ కూడా తినవచ్చు.
టీ బ్రేక్‌లో మీరు ఉత్తపం, సోయా చాప్ లేదా గ్రిల్డ్ పనీర్ తీసుకోవచ్చు.
డిన్నర్: రాత్రి భోజనంలో, బ్రౌన్ రైస్‌తో రాజ్మా, పెరుగు తీసుకోవడం మంచిది. రాత్రిపూట సోయాబీన్ చాప్ గ్రేవీని కూడా తినవచ్చు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి -
పుష్కలంగా నీరు త్రాగాలి. చాలా మంది బరువు తగ్గే విషయంలో డైట్ జాగ్రత్తలు తీసుకుంటారు కానీ నీళ్ల విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. దాహం వేసినప్పుడే నీరు తాగాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలి. కొబ్బరి నీళ్లు తాగండి. జ్యూస్ తాగాలనే కోరిక ఉంటే ఇంట్లోనే ఫ్రెష్ జ్యూస్ చేసుకుని తాగండి.