తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Constipation Diet Plan : ఈ డైట్​తో మలబద్ధకాన్ని దూరం చేసుకోండి..

Constipation Diet Plan : ఈ డైట్​తో మలబద్ధకాన్ని దూరం చేసుకోండి..

25 August 2022, 10:59 IST

google News
    • Constipation Diet Plan : మలబద్ధకం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటి. ఈ సమస్య చాలా తీవ్రతరమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలనుకుంటే.. ఆహారంలో పలు మార్పులు చేయాలంటున్నారు డైటీషన్లు. 
మలబద్ధకాన్ని ఇలా దూరం చేసుకోండి
మలబద్ధకాన్ని ఇలా దూరం చేసుకోండి

మలబద్ధకాన్ని ఇలా దూరం చేసుకోండి

Constipation Diet Plan : మలబద్ధకం సమస్యను తేలికగా తీసుకోకూడదంటున్నారు డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి సరైన డైట్ ప్లాన్ అవసరం అవసరం అంటున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడితే కచ్చితంగా వైద్యుని సంప్రదించాలి అంటున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవ్వడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా నయమవుతుంది అంటున్నారు. అయితే మన్‌ప్రీత్ ఎలాంటి డైట్ తీసుకోవాలో సూచిస్తున్నారు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడితే ఈ డైట్​ను ఫాలో అవ్వండి.

ఉదయం నిద్రలేచిన వెంటనే..

రాత్రి పడుకునే ముందు ఒక కప్పు నీటిలో ఒక చెంచా తులసి గింజలను నానబెట్టండి. ఉదయమే దానిని తాగండి. ఇవే కాకుండా 5 బాదంపప్పులు, 1 వాల్‌నట్‌, 3 నల్ల ఎండుద్రాక్ష (రాత్రిపూట నానబెట్టి) ఉదయం బ్రేక్​ఫాస్ట్​కి ముందు తీసుకోండి.

అల్పాహారం కోసం ఏమి తీసుకోవాలి..

అల్పాహారం కోసం ఖర్జూరం, ఓట్స్, దాల్చిన చెక్క, చియా గింజలతో కూడిన ఒక కప్పు పాలు తీసుకోండి. దీంతో పొట్ట క్లియర్ అవుతుంది. బొప్పాయిని తప్పకుండా డైట్​లో చేర్చుకోండి. పండిన బొప్పాయి తింటే పొట్ట శుభ్రపడుతుంది.

మధ్యాహ్న భోజనంలో ఏమి తినాలి..

భోజనానికి 30 నిమిషాల ముందు బటర్​ మిల్క్ తాగండి. మధ్యాహ్న భోజనంంలో రొట్టెలు తీసుకోండి. దానితో పాటు ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు. మధ్యాహ్న మీల్​లో ఎక్కువ ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.

సాయంత్రం సంగతేంటి?

సాయంత్రం 5 గంటల వరకు కొంచెం పెరుగుతో కీరదోసకాయ, క్యారెట్, దుంపలు తినండి. పెరుగులో కొన్ని కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి తీసుకోండి.

రాత్రి డైట్​

డిన్నర్ చాలా త్వరగా ముగించేయండి. కూరగాయలు ఎక్కువగా తినండి. ఆ తర్వాత పాలలో కాస్త మిరియాలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపి తాగేయాలి.

టాపిక్

తదుపరి వ్యాసం