తెలుగు న్యూస్  /  ఫోటో  /  Easy Remedies Of Constipation : మలబద్ధకాన్ని ఇలా ఈజీగా వదిలించేసుకోండి..

Easy Remedies of Constipation : మలబద్ధకాన్ని ఇలా ఈజీగా వదిలించేసుకోండి..

26 July 2022, 15:12 IST

Easy Remedies of Constipation : చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం ఒకటి. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు.

  • Easy Remedies of Constipation : చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం ఒకటి. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు.
కడుపు సమస్యలు చాలా చికాకు కలిగిస్తాయి. ఉదయం సమయంలో కడుపు శుభ్రం కాకపోతే అదో చిరాకు ఉంటుంది. రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది దీర్ఘకాలిక మలబద్ధకం, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక్కోసారి గుండెల్లో మంట సమస్య కూడా పెరుగుతుంది. 
(1 / 7)

ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంట్లోనే అనేక మార్గాలు ఉన్నాయి. అవి మందులు కాదు. వీటిని వాడితే మలబద్ధకం సమస్య చాలా వరకు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణుడు దీక్షా భావ్సార్ తెలిపారు. ఇంతకీ ఏమి తీసుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
(2 / 7)

మెంతులు : 1 టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం తినండి. నిద్రపోయేముందు మీరు 1 స్పూన్ మెంతె పిండిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు.
(3 / 7)

ఎండుద్రాక్ష: నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. ఎండుద్రాక్షను నానబెట్టడం ముఖ్యం. ఎందుకంటే ఎండు ద్రాక్ష గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. నానబెట్టిన తర్వాత అవి సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టండి. ఉదయం తినండి.
(4 / 7)

నెయ్యి: ఆవు పాలు నెయ్యి జీవక్రియను పెంచుతుంది. కానీ గేదె పాలు నెయ్యి తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది అందరి ఆరోగ్యానికి మంచిదికాదు. బరువు పెరగాలనుకునే వారికి గేదె పాల నెయ్యి మంచిది. 1 టీస్పూన్ ఆవు పాల నెయ్యిని ఒక గ్లాసు గోరువెచ్చని పాల మిశ్రమం తీసుకుంటే.. దీర్ఘకాలిక మలబద్ధకం నుంచి ఉపశమనం అందుతుంది. 
(5 / 7)

ఆవు పాలు : కడుపుని శుభ్రపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరికీ పని చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు. గర్భిణీ స్త్రీలు కూడా తాగవచ్చు. పడుకునేటప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. ఇది ఉదయం కడుపుని క్లియర్ చేస్తుంది.
(6 / 7)

ఉసిరి రసం: ఇది పొట్టను శుభ్రపరచడంలో గొప్పగా సహాయం చేస్తుంది. ఈ జ్యూస్‌ని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు నెరవడం, బరువు పెరగడం వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. మీరు ఉసిరికాయను పచ్చిగా లేదా పొడిగా తిన్నా అది మీకు మేలు చేస్తుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి