Water Melon Day : పుచ్చకాయ పండు మాత్రమే కాదు.. కూరగాయ కూడా..-water melon day history and significance and some interesting facts about water melon
Telugu News  /  Lifestyle  /  Water Melon Day History And Significance And Some Interesting Facts About Water Melon
జాతీయ పుచ్చకాయ దినోత్సవం
జాతీయ పుచ్చకాయ దినోత్సవం

Water Melon Day : పుచ్చకాయ పండు మాత్రమే కాదు.. కూరగాయ కూడా..

03 August 2022, 11:12 ISTGeddam Vijaya Madhuri
03 August 2022, 11:12 IST

Water Melon Day : పుచ్చకాయను ఇష్టపడనివారుండరు. చిన్నపిల్లల నుంచి వృద్ధులవరకు వయసు తేడా లేకుండా అందరూ హ్యాపీగా లాగించేస్తారు. ఇంక సమ్మర్​లో అయితే చెప్పనవసరంలేదు. అందుకే దీనికోసం ఓ డే పెట్టి.. జాతీయ పుచ్చకాయ దినోత్సవం జరుపుకుంటుంది US.

Water Melon Day : పుచ్చకాయను మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. ఏ సీజన్​లోనైనా దొరికే పుచ్చకాయను ఎక్కువగా సమ్మర్​లో సేవిస్తూ ఉంటారు. ఇది రుచితోపాటు.. చాలా పోషక ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే ఈరోజు జాతీయ పుచ్చకాయ దినోత్సవం (US) సందర్భంగా దాని గురించి మరింత ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

పుచ్చకాయల చరిత్ర

పుచ్చకాయ మొట్టమొదట దక్షిణాఫ్రికాలో 5,000 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. అడవి పుచ్చకాయను ఈజిప్షియన్లు పెంపకం చేశారని చెబుతూ ఉంటారు. 4,000 సంవత్సరాల పురాతనమైన ఈజిప్టులోని సమాధులలో పుచ్చకాయల విత్తనాలు, పెయింటింగ్‌లను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు.

ఇది 7వ శతాబ్దంలో భారతదేశానికి చేరుకుంది. అప్పటి నుంచి ఈ రుచికరమైన, ఐకానిక్ ఎర్రటి పండు వేసవిలో ప్రధానమైనదిగా మారింది.

మెదడుకు మేత

పుచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఇది అనూహ్యంగా హైడ్రేటింగ్, రిఫ్రెష్ చేస్తుంది. ఇది సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్‌తో నిండి ఉంది. ఈ పండులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి కూడా గొప్ప నిష్పత్తిలో ఉంటాయి. ముఖ్యంగా పుచ్చకాయ ఒక కప్పుకు 46 కేలరీలను మాత్రమే అందిస్తుంది. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత రుగ్మతలు, వాపులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయం చేస్తుందని నిరూపించబడింది.

పుచ్చకాయ గురించి ఆసక్తికరమైన విషయాలు

పుచ్చకాయ ఒక పండు. అంతే కాకుండా ఇది కూరగాయ కూడా. చాలామంది దీనిని వండుకుని తింటారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ రకాల పుచ్చకాయలు ఉన్నాయి. వాటిలో కొన్ని గులాబీ, నారింజ రంగులో ఉంటాయి. మీరు జపాన్‌లో హృదయం, మానవ ముఖాలు, పిరమిడ్‌ల ఆకారంలో పుచ్చకాయలను కనుగొనవచ్చు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇప్పటివరకు అత్యంత బరువైన పుచ్చకాయ బరువు 350.5 పౌండ్లు (159కిలోలు) ఉంది.

ఇంట్లో పుచ్చకాయలను ఎలా పెంచాలి

ఒక పుచ్చకాయ వెచ్చని వాతావరణం, లోమీ నేలలో బాగా పెరుగుతుంది. మీ తోటలో కొన్ని విత్తనాలను వేయండి. దానికి తగినంత సూర్యరశ్మి, పెరగడానికి స్థలం ఉండేలా చూసుకోండి. మీరు దీన్ని ఇంటి లోపల కూడా నాటవచ్చు. క్రమం తప్పకుండా నీరు పెట్టండి. కానీ ఎక్కువ నీరు పెట్టకండి. కలుపు మొక్కలను తీసేయండి. అప్పుడు పుచ్చకాయలు మంచి ఏపుగా పెరుగుతాయి.

సంబంధిత కథనం

టాపిక్