Breakfast Recipe : బ్రెడ్ మలై రోల్.. ఇలా సింపుల్‌గా తయారు చేసేసుకోండి..
Today Breakfast Recipe : ఓ చక్కని స్వీట్‌తో రోజుని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. పైగా దానిని తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు మాత్రమే సరిపోతాయంటే.. చేసుకోకుండా ఎలా ఉంటాము చెప్పండి. పైగా పండుగల సమయంలో కొత్తగా స్వీట్స్ తయారు చేసుకుని లాగించాలని అనుకునేవారు కచ్చితంగా ఈ స్వీట్ ట్రై చేయాల్సిందే.
Bread Malai Roll : ప్రతి ఇంట్లో బ్రెడ్, మిల్క్, పంచదార కచ్చితంగా ఉంటాయి. వీటితో మీరు ఓ చక్కని అద్భుతమైన స్వీట్ తయారు చేసుకుని.. డే ప్రారంభించవచ్చు తెలుసా? అయితే ఈ స్వీట్ కోసం మరో రెండు మూడు పదార్థాలు ఉంటే చాలు.. బ్రెడ్ మలై రోల్ సిద్ధమైపోతుంది. పైగా దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. మరి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేమిటో.. తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థలు
* మిల్క్ బ్రెడ్ - 4
* పాలు - 1 లీటర్
* క్రీమ్ - 20 గ్రాములు
* స్వీట్ కోవా - 100 గ్రాములు
* పంచదార - 200 గ్రాములు
* డ్రై ఫ్రూట్స్ - కొన్ని (తురిమి పెట్టుకోవాలి)
బ్రెడ్ మలై తయారీవిధానం
ఒక పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించి.. దానిలో పాలు పోసి మరిగించండి. దానిలో పంచదార, స్వీట్ కోవా, క్రీమ్ వేయండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుని.. లోపలి వైపు క్రీమ్ రాసి, స్లైస్‌లను రోల్ చేయండి. ఈ రోల్స్‌ని పాల మిశ్రమంలో వేయండి. అనంతరం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి.. చల్లగా సర్వ్ చేసి తింటే ఉంటుంది.. అద్భుతహా అనాల్సిందే.
సంబంధిత కథనం