తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol Affects Muscles । అతిగా మద్యం సేవించే వారిలో కండరాల బలహీనత, తేల్చిన తాజా సర్వే!

Alcohol Affects Muscles । అతిగా మద్యం సేవించే వారిలో కండరాల బలహీనత, తేల్చిన తాజా సర్వే!

HT Telugu Desk HT Telugu

26 May 2023, 10:50 IST

    • Alcohol Affects Muscles: అతిగా మద్యం సేవించే వారు వయస్సు పెరిగే కొద్దీ కండరాలను కోల్పోతూ ఉంటారు, వారి జీవితంలో బలహీనత, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. 
Alcohol Affects Muscles
Alcohol Affects Muscles (unsplash)

Alcohol Affects Muscles

Alcohol Affects Muscles: చిన్న వయస్సు నుంచే ఎక్కువగా మద్యపానం చేయడం వలన కండరాల నష్టం, బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అధ్యయనం ప్రకారం, రోజుకు 10 యూనిట్లు లేదా అంతకంటే ఎక్కువ తాగేవారిలో కండరాలు తక్కువగా ఉంటాయి. రోజూ ఒక బాటిల్ వైన్ తాగేవారిలో వారు 50- 60 ఏళ్ల వయస్సు వచ్చేసరికి కండరాలు లేకుండా బక్కపలుచగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అతిగా మద్యం సేవించే వారు వయస్సు పెరిగే కొద్దీ కండరాలను కోల్పోతూ ఉంటారు, వారి జీవితంలో బలహీనత, ఇతర సమస్యలకు దారి తీస్తుంది అని UEAలోని నార్విచ్ మెడికల్ స్కూల్ నుండి ప్రొఫెసర్ ఐల్సా వెల్చ్ చెప్పారు.

తమ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు UK బయోబ్యాంక్ నుండి డేటాను పరిశీలించారు, ఇందులో భాగం తమ దేశంలోని సుమారు 5 లక్షల మంది ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఇతర వాటికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పరిశీలించారు. ఇందులో 37 మరియు 73 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 200,000 మంది మద్యం అలవాటు ఉన్న వ్యక్తుల డేటాను పరిశీలించారు, వారు ఎంత ఆల్కహాల్ సేవించారు, తదనుగుణంగా వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరిగాయి, ఆల్కాహాల్ వారి కండరాలను ఏ విధంగా బలహీనపరిచిందో గుర్తించినట్లు పరిశోధకులు వివరించారు.

కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. పరిశోధకులు వ్యక్తులు తీసుకున్న ప్రోటీన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. వారి శారీరక శ్రమ స్థాయిలు ఎలాంటి ప్రభావాలు చూపాయి వంటి ఇతర అంశాలను కూడా వారు పరిగణించారు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే, మద్యం తాగని వ్యక్తులతో పోలిస్తే మద్యం తాగే వ్యక్తుల కండరాలు బలహీనపడుతున్నట్లు తాము గుర్తించామని వైద్యపరిశోధకులు స్పష్టం చేశారు. 50-60 ఏళ్లు వచ్చేసరికి వారు బలహీనంగా, కండరాలు లేకుండా మారినట్లు గుర్తించామన్నారు.

అధ్యయనం ప్రకారం, ప్రజలు రోజుకు మద్యం 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు తాగుతున్నప్పుడు సమస్యగా మారింది, ఇది ఒక బాటిల్ వైన్ లేదా నాలుగు లేదా ఐదు పింట్స్‌కు సమానం. ఆల్కహాల్ వినియోగం, కండర ద్రవ్యరాశిని క్రాస్-సెక్షనల్‌గా కొలుస్తాము. మద్యం అధిక స్థాయిలో వినియోగంలో కండర ద్రవ్యరాశిపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని అధ్యయనం చూపిస్తుంది. అధిక మొత్తంలో మద్యం సేవించకుండా ఉండాలని చెబుతున్నారు.