తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muscle Pain Remedies । కండరాల నొప్పిని ఇలా తగ్గించుకోవచ్చు.. వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే?

Muscle Pain Remedies । కండరాల నొప్పిని ఇలా తగ్గించుకోవచ్చు.. వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే?

HT Telugu Desk HT Telugu

28 November 2022, 13:16 IST

    • Muscle Pain Home Remedies: ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తున్నప్పుడు ఇంటి చిట్కాలతోనే ఉపశమనం పొందవచ్చు, ఎలాంటి లక్షణాలు ఉంటే డాక్టరును సంప్రదించాలో తెలుసుకోండి.
Muscle Pain Home Remedies
Muscle Pain Home Remedies (Unsplash)

Muscle Pain Home Remedies

కండరాల నొప్పులు కూడా ఇప్పుడు అందరికీ సర్వసాధారణమయ్యాయి. ఒక సర్వే ప్రకారం జనాభాలో సుమారు 65 శాతం మంది తరచూ ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులను అనుభవిస్తున్నారు. ఏ పని చేయకుండా నిశ్చలంగా ఒకే చోట కూర్చోవడం లేదా శారీరక శ్రమ ఎక్కువైనపుడు, తీవ్రమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు కండరాల నొప్పులు ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : మీకు ఈ అలవాట్లు ఉంటే పేదరికంలోనే ఉండిపోతారు

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Cucumber Egg fried Rice: కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్... బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోయే వంటకం, ఎవరికైనా నచ్చుతుంది

Saturday Motivation: ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

మారుతున్న వాతావరణ పరిస్థితులు, చలికాలం కారణంగా కండరాల నొప్పులు మరింత ఎక్కువవుతున్నాయి. అయితే కండరాల నొప్పి ఉన్నప్పుడు వెంటనే కౌంటర్ ఔషధాలు తీసుకోవడం, చికిత్స కోసం పరుగులు తీయడం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఇంటివద్దనే కొన్ని సాధారణ నివారణలు ప్రయత్నించాలి. ఇంటి చిట్కాలతోనే దాదాపు కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి.

Muscle Pain Home Remedies - కండరాల నొప్పికి ఇంటి నివారణలు

కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

స్ట్రెచింగ్

కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి స్ట్రెచింగ్ ఒక అద్భుతమైన అభ్యాసం. కండరాలు పట్టుకున్నపుడు చేతులు, కాళ్లను, శరీరాన్ని సాగదీయాలి. అలాగే ఎవరైనా సరే వ్యాయామం చేసే ముందు వార్మప్ చేయడం ఎంత ముఖ్యమో, వ్యాయామం పూర్తయిన తర్వాత స్ట్రెచింగ్ చేయడమూ ముఖ్యమే. వ్యాయామం చేసినప్పుడు, కండరాలు కుదింపుకులోనవుతాయి. ఇది కండరాల నొప్పులు, వాపును కలిగిస్తుంది. స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల నొప్పి రాకుండా ఉంటుంది.

మసాజ్

కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మసాజ్ ఉత్తమ చికిత్స. మీ కండరాలలో నొప్పి అనిపిస్తే, మీరు ప్రభావిత ప్రాంతంలో గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పికి ఆవాల నూనె చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆవనూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల ఆర్థరైటిస్‌తో సహా తీవ్రమైన కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు నయం చేయవచ్చు.

హాట్ కంప్రెస్

కండరాల నొప్పికి చికిత్స చేయడంలో హాట్ కంప్రెస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో హీట్ థెరపీ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా దెబ్బతగిలి కండరాలలో నొప్పి, మంట కలిగి బాధిస్తున్నప్పుడు ఐస్ ముక్కలతో కోల్డ్ కంప్రెస్ చేయవచ్చు. ఇది చల్లటి అనుభూతిని కలిగించి ఉపశమనం అందిస్తుంది.

తులసి రసం తీసుకోవడం

తులసిని మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు. తులసి ఒక ఆయుర్వేద ఔషధం కూడా అని మనకు తెలిసిందే. తులసిలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది కండరాలకు మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది. రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులు నమలడం ద్వారా కూడా ప్రయోజనాలు ఉంటాయి.

తదుపరి వ్యాసం