Acidity Causes and Remedies । ప్రధానంగా ఈ 5 కారణాల వలనే ఎసిడిటీ.. బయట పడేదెలా?-these 5 lifestyle factors cause acidity know remedies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These 5 Lifestyle Factors Cause Acidity, Know Remedies

Acidity Causes and Remedies । ప్రధానంగా ఈ 5 కారణాల వలనే ఎసిడిటీ.. బయట పడేదెలా?

Nov 07, 2022, 09:14 AM IST HT Telugu Desk
Nov 07, 2022, 09:14 AM , IST

  • Reasons for Acidity: తరచుగా ఎసిడిటీని అనుభూతి చెందుతున్నారంటే దాని అర్థం మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగాలేదు అని. చాలా సార్లు ఎసిడిటీ కలగటానికి మీరు అనుసరించే జీవనశైలి, చెడు అలవాట్లు కారణంగా ఉంటున్నాయి.  ఎసిడిటీకి న్యూట్రిషనిస్టులు 5 ప్రధాన కారణాలను ఎత్తిచూపారు. అవేంటో చూడండి.

ఎసిడిటీ అనేది దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా అనుభవించే ఉంటారు.  గ్యాస్ట్రిక్ గ్రంధుల ద్వారా కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ వస్తుంది అని పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా తెలిపారు. ఎసిడిటీ కలగడానికి 5 ప్రధాన కారణాలు చూడండి.

(1 / 7)

ఎసిడిటీ అనేది దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా అనుభవించే ఉంటారు. గ్యాస్ట్రిక్ గ్రంధుల ద్వారా కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ వస్తుంది అని పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా తెలిపారు. ఎసిడిటీ కలగడానికి 5 ప్రధాన కారణాలు చూడండి. (Shutterstock)

 టీ, కాఫీలు ఎక్కువగా తాగడం: చాలా మంది కెఫిన్ పానీయాలు లేకుండా ఉండలేరు. జీవితంలో అధికమైన ఒత్తిళ్లు, ఉద్యోగంలో పనివేళలను ఎదుర్కోవటానికి కాఫీ, స్ట్రాంగ్ టీలను ఎక్కువగా తాగేస్తారు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. తాత్కాలిక ఉపశమనాన్ని అందించే ఈ అలవాటు శాశ్వతమైన నష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి ఈ అలవాటు మార్చుకోవాలి.

(2 / 7)

టీ, కాఫీలు ఎక్కువగా తాగడం: చాలా మంది కెఫిన్ పానీయాలు లేకుండా ఉండలేరు. జీవితంలో అధికమైన ఒత్తిళ్లు, ఉద్యోగంలో పనివేళలను ఎదుర్కోవటానికి కాఫీ, స్ట్రాంగ్ టీలను ఎక్కువగా తాగేస్తారు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. తాత్కాలిక ఉపశమనాన్ని అందించే ఈ అలవాటు శాశ్వతమైన నష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి ఈ అలవాటు మార్చుకోవాలి. (Freepik)

అసమయ భోజనాలు: ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడటానికి, మీ కడుపు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహరం తినే వేళకు అనుగుణంగా ఈ ఆమ్లం దానంతటదే ఉత్పత్తి అవుతుంది. అయితే సమయానుసారంగా భోజనం చేయకపోతే మీ కడుపులో ఆమ్లం పేరుకుపోతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, వికారంకు దారితీయవచ్చు

(3 / 7)

అసమయ భోజనాలు: ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడటానికి, మీ కడుపు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహరం తినే వేళకు అనుగుణంగా ఈ ఆమ్లం దానంతటదే ఉత్పత్తి అవుతుంది. అయితే సమయానుసారంగా భోజనం చేయకపోతే మీ కడుపులో ఆమ్లం పేరుకుపోతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, వికారంకు దారితీయవచ్చు(Shutterstock)

ధూమపానం, అధిక కొవ్వు పదార్ధాలు తినడం: ధూమపానం గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అభివృద్ధి చెందే అవకాశంతో ముడిపడి ఉంటుంది, అయితే అధిక కేలరీల ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండూ ఆమ్లత్వానికి దారితీసేవే.

(4 / 7)

ధూమపానం, అధిక కొవ్వు పదార్ధాలు తినడం: ధూమపానం గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అభివృద్ధి చెందే అవకాశంతో ముడిపడి ఉంటుంది, అయితే అధిక కేలరీల ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండూ ఆమ్లత్వానికి దారితీసేవే.(Unsplash)

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం: భోజనం, ఆ వెంటనే నిద్రపోతే  అది యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది, ఎందుకంటే భోజనం తర్వాత అడ్డంగా పడుకోవడం జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది. తిన్న తర్వాత కనీసం 3 గంటలు వేచి ఉండి, ఆ తర్వాత నిద్రపోవడం ఉత్తమం.

(5 / 7)

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం: భోజనం, ఆ వెంటనే నిద్రపోతే అది యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది, ఎందుకంటే భోజనం తర్వాత అడ్డంగా పడుకోవడం జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది. తిన్న తర్వాత కనీసం 3 గంటలు వేచి ఉండి, ఆ తర్వాత నిద్రపోవడం ఉత్తమం. (Getty Images/iStockphoto)

 నిద్రలేమి: రాత్రి తగినంత నిద్ర లేకపోవడం వల్ల కడుపులో ఆమ్లం పెరుగుతుంది, ఇది LESను చికాకుపెడుతుంది, యాసిడ్ అన్నవాహికను చేరేలా చేస్తుంది. తద్వారా గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్/GERD లక్షణాలను కలిగిస్తుంది.

(6 / 7)

నిద్రలేమి: రాత్రి తగినంత నిద్ర లేకపోవడం వల్ల కడుపులో ఆమ్లం పెరుగుతుంది, ఇది LESను చికాకుపెడుతుంది, యాసిడ్ అన్నవాహికను చేరేలా చేస్తుంది. తద్వారా గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్/GERD లక్షణాలను కలిగిస్తుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు