Acidity | కడుపు మంటగా ఉందా? అయితే ఇవి తాగండి..-try these five natural drinks for acidity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acidity | కడుపు మంటగా ఉందా? అయితే ఇవి తాగండి..

Acidity | కడుపు మంటగా ఉందా? అయితే ఇవి తాగండి..

HT Telugu Desk HT Telugu
Mar 18, 2022 03:07 PM IST

ఎసిడిటీతో పోరాడుతున్నప్పుడు నిస్సహాయంగా, చిరాకుగా భావించకండి. ఆయుర్వేదం ప్రకారం.. మీరు ఏది తిన్నా అది శరీరంలో ఉన్న అగ్నికి కట్టుబడి ఉంటుంది. మీరు తినే ఆహారం మీ జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తూ ఈ మంటను పెంచవచ్చు లేదా తగ్గింవచ్చు. ఈ మంట పెరిగితే ఎసిడిటీ ఏర్పడుతుంది. మరి ఎసిడిటీని తగ్గించుకోవడానికి ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇవి మీకోసమే ట్రై చేయండి.

కడుపులో మంట
కడుపులో మంట

మీకు ఇప్పటివరకు ఎన్నిసార్లు కడుపునొప్పిని వచ్చింది? చాలా సార్లే అయి ఉండాలి. అతిగా తినడం లేదా మీకు ఇష్టమైన స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశముంది. ఇది కడుపులో మంట, ఉబ్బరం, గొంతులో చేదు రుచికి కూడా దారి తీస్తుంది. ఈ లక్షణాలు ఒక విషయాన్ని సూచిస్తాయి. అదే మీకు ఎసిడిటీ ఉందని. అయితే ఈ ఎసిడిటీ ఎప్పుడు ఎలా వస్తాదో మనకు తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా.. మనం దానిని సహజంగా తగ్గించుకోవచ్చు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా?

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీ కడుపు సమస్యలను పెంచుతాయి. వేయించిన ఆహారాలు, కాల్చిన-చీజీ ఆహారాలు, చాలా చల్లటి ఆహారాలు, అనారోగ్యకరమైన భోజనాలు విషాన్ని లేదా ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే జీర్ణంకాని అవశేషాలను వదిలివేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలకు అంతర్లీన సమస్యలుగా చెప్పవచ్చు. కాబట్టి, మీ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను వదులుకోండి. ఒకవేళ ఎసిడిటీ వస్తే.. ఈ పానీయాలను ప్రయత్నిచంమంటున్నారు ఆయుర్వేద నిపుణురాలు వైద్య శకుంతలా దేవి.

1. పాలు, గులాబీ రేకులు

కాచిన పాలు, గులాబీ రేకులను తాగడం ద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఉదయాన్నే మీ కడుపుని ఖాళీ చేస్తుంది. కొన్ని రోజుల పాటు దీనిని తీసుకోవడం వల్ల మీ మలబద్ధకం సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

2. జీరా

ఒక కూజా నీటిలో, జీలకర్ర (జీరా), క్యారమ్ గింజలు (అజ్వైన్) కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి.. తాగండి. ఈ పానీయం జీవక్రియ వృద్ధికి, జీర్ణక్రియకు, మలబద్ధకాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

3. పుదీనా ఆకులు

పుదీనా ఆకులు దాదాపు అన్ని కడుపు సమస్యలకు సహాయపడతాయి. పుదీనా యాసిడ్ ఉత్పత్తిని తగ్గించి కడుపులో మంటను తగ్గిస్తుంది. కాబట్టి కొన్ని పుదీనా ఆకులను మెత్తగా కోసి నీటిలో వేసి.. ఆపై చల్లార్చిన ద్రావణాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.

4. చల్లని పాలు

యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనానికి చల్లని పాలు తాగడం అనేది ప్రజలు ఉపయోగించే సులభమైన అత్యంత సాధారణ గృహ చికిత్స. పాలలో కాల్షియం ఉండటం వల్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అదనపు స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా కడుపులో ఆమ్లాలను తగ్గిస్తుంది. “పాలులోని అధిక కాల్షియం కంటెంట్ యాసిడ్ సమస్యలను తగ్గించడానికి, ఇప్పటికే సృష్టించబడిన యాసిడ్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. దాని చల్లదనం కారణంగా ఇది మండే అనుభూతి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

5. ముల్లంగి రసం

ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రేగు కదలికలను సక్రమంగా నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. ఈ వేరు కూరగాయల రసాన్ని తాగడం వల్ల మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి ఇతర జీర్ణ రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.

WhatsApp channel