తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Study On Muscle Strength: కండరాల పటుత్వం మీ మరణాన్ని ముందే చెప్పేస్తుంది

Study on Muscle strength: కండరాల పటుత్వం మీ మరణాన్ని ముందే చెప్పేస్తుంది

HT Telugu Desk HT Telugu

11 November 2022, 10:45 IST

    • Study reveals muscle strength tied to biological age: మీ కండరాల పటుత్వం మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు.. మీరు ఎంత త్వరగా వృద్ధాప్యాన్ని చేరుకుంటారు.. ఎప్పుడు మరణిస్తారన్న అంశాలను ముందే చెప్పేస్తుందట.. మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో ఇది వెల్లడైంది.
 కండరాల పటుత్వం చాలా ముఖ్యమైన ఆరోగ్య సూచికగా తేల్చిన మిచిగాన్ యూనివర్శిటీ
కండరాల పటుత్వం చాలా ముఖ్యమైన ఆరోగ్య సూచికగా తేల్చిన మిచిగాన్ యూనివర్శిటీ (HT_PRINT)

కండరాల పటుత్వం చాలా ముఖ్యమైన ఆరోగ్య సూచికగా తేల్చిన మిచిగాన్ యూనివర్శిటీ

Study reveals muscle strength tied to biological age: ఇద్దరు ఒకే వయస్సు గల వ్యక్తుల బయోలాజికల్ వయస్సులు వేర్వేరుగా ఉంటాయి. అంతర్గత, బాహ్య పరిస్థితులు ఇందుకు కారణమవుతాయి. ఫలితంగా వృద్ధాప్యం, వ్యాధుల ముట్టడి, మరణం ఇవన్నీ ఆ ఇద్దరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

వ్యాధులు, పౌష్ఠికాహార లోపం, స్మోకింగ్, ఇతర జీవనశైలి కారకాలు బయోలాజికల్ వయస్సును వేగవంతం చేస్తారు. అంటే త్వరగా వృద్ధాప్యానికి చేరువవుతారు. వేగంగా పెరిగిన జీవ సంబంధిత (బయోలాజికల్) వయస్సు, కండరాల బలహీనత మధ్య ఉన్న లింకును తొలిసారిగా పరిశోధకులు కనిపెట్టారు.

ఈ పరిశోధన ఫలితాల ప్రకారం జీవ సంబంధిత వయస్సును అనుసరించి ఎముకలు, కండరాల పటుత్వం తగ్గుతుందని కాచెక్సియా జర్నల్‌లో వెల్లడించింది.

మిచిగాన్ మెడిసిన్‌ సంబంధిత పరిశోధకులు డీఎన్ఏ మిథైలేషన్ ప్రాతిపదికన వయస్సును వేగవంతం చేసే మూడు గడియారాలను ఉపయోగించారు. వయస్సు ఏ దశలో ఉందో అంచనా వేసే మాలిక్యులర్ డయాగ్నస్టిక్ ప్రక్రియనే డీఎన్ఏ మిథైలేషన్ అంటారు. దీని ద్వారా బయోలాజికల్ ఏజ్, గ్రిప్ పటుత్వం విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 1274 మంది మధ్య వయస్కుల గ్రిప్ స్ట్రెంత్ పరిశీలించారు. తొలుత ఈ కొలమానాలు(గడియారాలు) త్వరిత మరణాలు, అల్జీమర్స్ డిసీజ్, ఇన్‌ఫ్లమేషన్, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, శారీరక వైకల్యాలు వంటి వాటిని అధ్యయనం చేసేందుకు రూపొందించారు.

ఈ డయాగ్నిస్టిక్స్‌లో తక్కువ పటుత్వం, త్వరిత జీవసంబంధిత వయస్సు వృద్ధులైన మగవారు, ఆడవారికి చెందినవని డీఎన్ఏ మిథైలేషన్ క్లాక్స్‌ తేల్చింది.

‘కండరాల పటుత్వం దీర్ఘకాల జీవితాన్ని అంచనా వేసేదని మనకు తెలుసు. కండరాల బలహీనత ఆధారంగా వ్యాధులు, మరణాన్ని కూడా అంచనా వేయొచ్చు. అయితే తొలిసారిగా కండరాల బలహీనతకు, వాస్తవిక జీవ సంబంధిత వయస్సు వేగానికి గల బయోలాజికల్ లింక్ మేం కనుగొన్నాం..’ అని ఈ పరిశోధనలో ప్రధాన వ్యాస కర్త మిచిగాన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్క్ పీటర్‌సన్ తెలిపారు.

‘అంటే మీరు మీ కండరాల పటుత్వాన్ని మొత్తం జీవితకాలం కాపాడుకుంటే మీరు వయస్సు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందుతారని ఈ పరిశోధన సూచిస్తోంది. ఉదాహరణకు స్మోకింగ్ మీ వ్యాధులు, మరణం యొక్క శక్తిమంతమైన అంచనా అని మనకు తెలుసు. ఇప్పుడు మనకు కొత్తగా తెలిసిందేంటంటే కండరాల బలహీనత కూడా ఒక ధూమపానం వంటి సూచికే..’ అని ఆయన తెలిపారు.

ఈ పరిశోధనలో భాగంగా 8 నుంచి 10 సంవత్సరాల పరిశీలన ఈ అధ్యయనానికి బలం చేకూర్చిందని సహ పరిశోధకులు మిచిగాన్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెస్సికా ఫాల్ తెలిపారు. తక్కువ పటుత్వాన్ని బయోలాజికల్ ఏజ్ వేగంగా పరుగెడుతోందని అంచనా వేసే సూచికగా ఆమె అభివర్ణించారు.

అనేక అనారోగ్య పరిస్థితులను తక్కువ పటుత్వం ద్వారా అంచనా వేయొచ్చని గతంలో జరిపిన అధ్యయనాలు తేల్చాయి. గుండె సంబంధిత వ్యాధులు, సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ కూడా గుండెజబ్బులను అంచనా వేసేందుకు గోల్డ్ స్టాండర్డ్ సూచికగా తక్కువ పటుత్వం నిలుస్తుందని ఒక అధ్యయనం తెలిపింది.

‘వయస్సు సంబంధిత వ్యాధులను నివారించడానికి లేదా జాప్యం చేయడానికి వీలుగా తగిన చికిత్స విధానాలను రూపొందించేందుకు ఈ గ్రిప్ స్ట్రెంత్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుంది..’ అని పీటర్సన్ వివరించారు. ‘వైద్యులు ఈ గ్రిప్ స్ట్రెంత్‌ సూచికను ఉపయోగించాలని మేం కోరుతున్నాం. గ్రిప్ స్ట్రెంత్ గొప్ప సూచిక అని చాలా అధ్యయనాలు చెబుతున్నప్పటికీ ఇంకా అందరు వైద్యులు దీనిని ఉపయోగించడం లేదు..’ అని వివరించారు.

గ్రిప్ స్ట్రెంత్‌కు, వృద్ధాప్యానికి మధ్య గల సమగ్ర సంబంధం తేల్చేందుకు భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు అవసరమని వివరించారు. అలాగే ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితులు వయస్సు సంబంధిత బలహీనతలను ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై కూడా ఇంకా భవిష్యత్తులో అధ్యయనాలు జరగాలని వారు అభిప్రాయపడ్డారు.

కాగా ప్రవర్తన, అలాగే పౌష్ఠికాహారం, వ్యాయామం వంటి జీవన శైలి మార్పులతో గ్రిప్ స్ట్రెంత్‌ను పెంచుకోగలిగితే వృద్ధాప్య వేగంలో మార్పులు చేసుకోగలుగుతామా అన్న అంశంపై కూడా ఇంకా అధ్యయనం జరగాలని అభిప్రాయపడ్డారు.

‘ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చాలా ముఖ్యపాత్ర పోషిస్తారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం ఇంకా కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల వారి జీవితకాలం మొత్తం తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..’ అని ఆయన వివరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం