తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food For Muscle Recovery: కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి 6 బెస్ట్ ఫుడ్స్

food for Muscle recovery: కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి 6 బెస్ట్ ఫుడ్స్

HT Telugu Desk HT Telugu

15 December 2022, 13:43 IST

google News
    • food for Muscle recovery: కండరాల నొప్పులు తరచుగా ఇబ్బందికి గురిచేస్తాయి. రోజువారీ పనులు చేసుకోనివ్వని పరిస్థితి కూడా ఎదురవుతుంది. అయితే మీ రోజువారీ డైట్‌లో ఈ 6 ఆహారాలు చేర్చుకుంటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి 6 సూపర్ ఫుడ్స్
కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి 6 సూపర్ ఫుడ్స్

కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి 6 సూపర్ ఫుడ్స్

శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలన్నా, రోజువారీ వ్యాయామం చేయాలన్నా మీ కండరాల ఆరోగ్యం చాలా ముఖ్యం. శరీరం తనంతట తాను అలసట, నొప్పుల నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి అవసరం. నిత్యం ఫిజికల్ యాక్టివిటీ కలిగి ఉండే వారు కండరాల నొప్పులు, వాటి నుంచి ఉపశమనం పొందడం అనుభవిస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి నుంచి దూరం జరగడానికి సాకులు వెతకొద్దు. శుభవార్త ఏంటంటే కండరాల ఆరోగ్యానికి, నొప్పుల నుంచి కోలుకోవడానికి ఉపయోగపడే ఆహారాలు కూడా ఉన్నాయి. ఇవి మీకు ఇంట్లో, స్థానిక మార్కెట్లోనే దొరుకుతాయి. ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఆ 6 ఆహార పదార్థాలివే.

1. Spinach: పాలకూర

పాలకూర అంటే చాలా మందికి ప్రాణం. ఒక కప్పు పాలకూరలో 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ ఏ, బీ, సీ వంటి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండే విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పైగా పాలకూరను రకరకాల రెసిపీల్లో వాడొచ్చు. వెజిటెబుల్ స్మూతీస్‌లో కూడా వాడొచ్చు.

2. Watermelon: పుచ్చ కాయ

వర్కవుట్స్ తరువాత పుచ్చకాయ తినాలని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతుంటారు. వర్కవుట్స్ చేసేటప్పుడు మీకు చెమటలు పట్టడం గమనిస్తుంటారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఈ వాటర్‌మెలన్ బాగా పనిచేస్తుంది. పుచ్చకాయల 92 శాతం నీరే ఉంటుంది. ఇది వర్కవుట్ తరువాత జ్యూస్ రూపంలో గానీ, స్నాక్ రూపంలో గానీ తీసుకుంటే మీకు చాలా మేలు చేస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే విటమిన్లు, ఖనిజలవణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి.

3. Bananas: అరటి పండ్లు

ఫిట్‌నెస్ కోసం వ్యాయామాలు చేసే వారు, ఆటలు ఆడేవారు అరటి పండ్లను బాగా ఇష్టపడతారు. వీటిలో ఐరన్, ఫైబర్, పొటాషియం, ఫొలేట్, యాంటాక్సిడంట్లు పుష్కలంగా ఉంటాయి. కండరాలు అలసట, నొప్పుల నుంచి కోలుకోవడానికి అరటి పండు బాగా పనిచేస్తుంది. పొటాషియం ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తూ మీ శరీరం కోల్పోయిన లవణాలను భర్తీ చేస్తూ మీ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

4. Fish: చేపలు

కండరాలు కోలుకునేలా చేసే ఫుడ్‌లో చేపలు కూడా ఒకటి. చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఇందుకు దోహదపడుతాయి. తరచుగా చేపలు తినడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది. రాహు, హిల్సా, బంగ్డా, పాప్లెట్ తదితర చేపలను తరచుగా తినాలి.

5. Citrus fruits: సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే సాఫ్ట్ టిష్యూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. టమాటా, కివీ, కమలాలు వంటి సిట్రస్ రకాలు బాగా మేలు చేస్తాయి.

6. Turmeric: పసుపు

పసుపు శరీరంలోని కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కురుక్యుమిన్ శరీరంలోని మంటను తగ్గిస్తుంది. గ్లాసు పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే తక్షణం ఉపశమనం పొందవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం