తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney In Danger : ఈ 8 అలవాట్లు మీ కిడ్నీ పాడై పోయేందుకు కారణాలు

Kidney In Danger : ఈ 8 అలవాట్లు మీ కిడ్నీ పాడై పోయేందుకు కారణాలు

HT Telugu Desk HT Telugu

18 March 2023, 9:09 IST

    • Kidney In Danger : కిడ్నీ సమస్యలతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన రోజూ వారీ అలవాట్లతోనే ఈ సమస్య వస్తుంది. వాటి నుంచి బయటపడాలి.
కిడ్నీ
కిడ్నీ

కిడ్నీ

మీరు రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే, నిద్రలేకపోవడం, చర్మం పొడిబారడం, తరచుగా మూత్రవిసర్జన, రక్తంతో కూడిన లేదా రంగు మారిన మూత్రం, చీలమండలు, కళ్ల చుట్టూ వాపు ఉంటే, ఇది మీ కిడ్నీ(Kidney) పాడైపోవచ్చని సంకేతం. కిడ్నీ శరీరంలోని ముఖ్యమైన భాగం. దానిలో లోపం ఉంటే, ఇతర అవయవాలలో కూడా సమస్యలు మొదలవుతాయి. అందుకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు తలనొప్పి(Headche), కడుపు నొప్పికి మందులను డాక్టర్ సలహా తీసుకోకుండా నేరుగా మెడికల్ స్టోర్ నుండి తీసుకుంటారు. ఇవి కిడ్నీకి హాని కలిగిస్తాయి. కొన్ని అలవాట్లు కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Rhododendron: ఉత్తరాఖండ్లో ఒక పువ్వు వికసించగానే కలవర పడుతున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసుకోండి

Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది

Parenting Tips : పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన విషయాలు ఇవి

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

ఉప్పు(Salt) ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

మాంసంలో(Meat) తగినంత ప్రోటీన్ ఉంటుంది. అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై జీవక్రియ లోడ్ పెరుగుతుంది. ఇది కిడ్నీ స్టోన్(Kidney Stone) సమస్యలకు దారితీస్తుంది.

చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ లేదా ఎక్కువ నొప్పి నివారణ మందులు(Pain Killer) వేసుకునే అలవాటు కిడ్నీపై చెడు ప్రభావం చూపుతుంది. వైద్యులను సంప్రదించకుండా అటువంటి మందులను తీసుకోవద్దు.

ఆల్కహాల్ అధికంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ కాలేయం, మూత్రపిండాలపై చాలా చెడు ప్రభావం ఉంటుంది. శీతల పానీయాలు కూడా హానికరం.

సిగరెట్(Cigarette) లేదా పొగాకు తీసుకోవడం వల్ల టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతింటుంది. దీంతో కిడ్నీపై ప్రభావం చూపే బీపీ కూడా పెరుగుతుంది.

మూత్రం ఆపుకున్నప్పుడు మూత్రాశయం నిండిపోతుంది. యూరిన్ రిఫ్లక్స్ సమస్య ఉన్నప్పుడు మూత్రం కిడ్నీ వైపు వస్తుంది. దీని బ్యాక్టీరియా కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం అవసరం. ఇంతకంటే తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ కిడ్నీ పనితీరుపై చెడు ప్రభావం చూపుతాయి. నీళ్లు ఎక్కువగా తాగినా కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే, ఊబకాయం ఉన్నవారిలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. అతిగా తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. కాబట్టి అతిగా తినడం మానుకోండి.

అధ్యయనం ప్రకారం, రోజూ 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో, మూత్రపిండాల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.