Best sources of calcium: కాల్షియం లభించే ఆహారం ఇదే.. న్యూట్రిషనిస్ట్ సూచనలు-know best sources of calcium nutritionist shares tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Sources Of Calcium: కాల్షియం లభించే ఆహారం ఇదే.. న్యూట్రిషనిస్ట్ సూచనలు

Best sources of calcium: కాల్షియం లభించే ఆహారం ఇదే.. న్యూట్రిషనిస్ట్ సూచనలు

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 12:11 PM IST

Calcium rich food: కాల్షయం లభించే ఆహారం కోసం చూస్తున్నారా? అయితే న్యూట్రిషనిస్ట్ సలహా పాటించండి.

కాల్షియం లభించే ఆహార పదార్థాలను సూచిస్తున్న న్యూట్రిషనిస్ట్
కాల్షియం లభించే ఆహార పదార్థాలను సూచిస్తున్న న్యూట్రిషనిస్ట్ (Unsplash)

శరీరం తన విధులు నిర్వర్తించేందుకు అతి ముఖ్యమైన పోషకం కాల్షియం. ఎముకలు, కండరాల పటిష్టతకు కాల్షియం ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, శరీరంలోని పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో తగినంత కాల్షియం ఉంటే అది మీ దంతాలను బలోపేతం చేస్తుంది. అలాగే కండరాల నొప్పులను నయం చేస్తుంది. బరువు తగ్గే మీ ప్రయత్నాల్లో కూడా కాల్షియం ఉపయోగపడుతుంది.

న్యూట్రీషనిస్ట్ అంజలీ ముఖర్జీ శరీరానికి కాల్షియం అవసరాలను, కాల్షియం దొరికే ఆహార పదార్థాలను వివరించారు. ‘పిల్లల ఆహారంలో తగినంత కాల్షియం ఉంటే వారి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పిల్లల్లో ఎముకలు బలంగా ఉంటే జీవితాంతం ఎముకల సంబంధిత అనారోగ్యం దరిచేరదు..’ అని వివరించారు. పాలల్లో మాత్రమే కాల్షియం లభిస్తుందని అనుకుంటారని, చాాలా ఆహార పదార్థాల్లో కాల్షియం లభిస్తుందని వివరించారు.

నల్ల నువ్వులు: నల్ల నువ్వుల్లో కాల్షియం, విటమిన్ బీ కాంప్లెక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నువ్వుల లడ్డూలు వంటివి ఎక్కువగా పండగల సమయంలో చేస్తారు. పిల్లలకు తరచూ ఇవి చేసివ్వడం వల్ల కాల్షియం వారికి తగినంతగా అందుతుంది.

పెరుగు: పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో ఎప్పుడూ పెరగు అందుబాటులో ఉంచుకుంటే పిల్లలకు కాల్షియం లభిస్తుంది. పెరుగన్నం తప్పనిసరిగా తినేలా పిల్లలను ప్రోత్సహించాలి.

పప్పుధాన్యాలు: రాజ్మా, కాబూలీ శనగలు, శనగలు, అలసందల్లో కాల్షియం విరివిగా ఉంటుంది. వీటిని టమాటా, ఉల్లితో కలిపి వండి అన్నంలో గానీ, చపాతీలో గానీ ఇవ్వొచ్చు.

కూరగాయలు: మెంతి, బ్రొకలీ, పాలకూర, బచ్చలికూర, ముల్లంగి వంటి వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీరలో కూడా కాల్షియం ఉంటుంది. పుదీనా, కొత్తిమీర చట్నీ తరచుగా చేస్తుంటే శాండ్‌విచ్ లేదా అన్నంతో కలిపి ఇవ్వొచ్చు.

గింజలు: వాల్‌నట్స్, అత్తి పండ్లు, ఖర్జూరాలు, ఆప్రికాట్లలో కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. స్నాక్స్ రూపంలో వీటిని తరచుగా ఇవ్వడం వల్ల పిల్లల ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి.

Whats_app_banner