తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rhododendron: ఉత్తరాఖండ్లో ఒక పువ్వు వికసించగానే కలవర పడుతున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసుకోండి

Rhododendron: ఉత్తరాఖండ్లో ఒక పువ్వు వికసించగానే కలవర పడుతున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

04 May 2024, 11:47 IST

    • Rhododendron: కొన్ని పువ్వులు, మొక్కలు వాతావరణంతో సంబంధాన్ని పెట్టుకుని ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా వాతావరణంలోని మార్పులను కూడా కనిపెట్టవచ్చు. అలాంటి పువ్వుల్లో ఒకటి రోడోడెండ్రాన్.
రోడోడెండ్రాన్ పువ్వులు
రోడోడెండ్రాన్ పువ్వులు

రోడోడెండ్రాన్ పువ్వులు

Rhododendron: హిమాలయాల చుట్టుపక్కల ఎర్రటి తివాచీ పరిచినట్టు కనిపిస్తాయి రోడోడెండ్రాన్ పువ్వులు. ఎరుపు మాత్రమే కాదు లేత గులాబీ పసుపు రంగులో కూడా ఈ పువ్వులు వేలాదిగా వికసిస్తాయి. ఇవి వికసించాక ఆ ప్రాంతాన్ని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు వెళ్తారు. సాధారణంగా ఈ పువ్వులు వసంతకాల ప్రారంభాన్ని సూచిస్తాయి. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ మధ్యలో ఈ పువ్వులు వికసిస్తాయి. కానీ ఈ ఏడాది అసాధారణంగా అవి డిసెంబర్, జనవరి నెలలోనే వికసించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పువ్వులు రెండు మూడు నెలల ముందే వికసించాయంటే గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉందని వారు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

పువ్వుల వికసించడం వల్ల…

కొండల్లో పెరిగే పుష్పించే మొక్కలు రోడోడెండ్రాన్. ఇవి పుష్పించడానికి 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. హిమాలయాల ప్రాంతాలలో ఆ ఉష్ణోగ్రతకు రావాలంటే మార్చి, ఏప్రిల్ నెలల వరకు ఆగాల్సిందే. కానీ ఈ ఏడాది ఇవి జనవరిలోనే అధికంగా పుష్పించాయి. అంటే హిమాలయాల చుట్టూ ఉష్ణోగ్రత అప్పుడే 20 డిగ్రీలకు చేరుకుందని అర్థం. మార్చి, ఏప్రిల్ నెలలో ఆ ఉష్ణోగ్రత ఆయా ప్రాంతాల్లో ఉంటుంది. కానీ రెండు నెలల ముందే అంతటి ఉష్ణోగ్రత వచ్చిందంటే గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉందని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే మానవ మునగడకే ఇబ్బందులు తెలుపుతాయి.

రోడోడెండ్రాన్ పువ్వులు ముందుగానే వికసించడంతో పర్యావరణవేత్తలు తీవ్రంగా కలవర పడుతున్నారు. ఈ పువ్వు వికసించడం వాతావరణంలోని మార్పులను సూచిస్తోందని చెబుతున్నారు. ఇవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఈ పువ్వుల ప్రాముఖ్యత

రోడోడెండ్రాన్ పువ్వులు స్థానిక సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో కూడా భాగమైపోయాయి. ఈ పువ్వు రసాన్ని సేకరించి అమ్మేవారు ఎంతోమంది. ఇదొక సాంప్రదాయ రిఫ్రిష్మెంట్ పానీయంగా తాగుతారు. ఇందులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. పూలతో తయారు చేసిన రసంలో పొటాషియం, ఇనుము, కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటుంది. పర్వతాలలో నివసించే వారికి అనారోగ్యాలు వస్తే వాటి నుండి బయట పడేసే శక్తి ఈ పానీయానికి ఉంది. అలాగే మహిళలు తరచూ ఈ పానీయాన్ని తాగుతూ ఉంటారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కాకుండా ఇది అడ్డుకుంటుంది.

ఇలా శీతాకాలంలోనే రోడోడెండ్రాన్ పువ్వులు వికసించడం అనేది బలహీనపడుతున్న ప్రకృతిని సూచిస్తుంది. మనిషి చేసే పనులకు గ్లోబల్ వార్మింగ్ సమస్య ఎంతగా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటేనే మనిషి ఈ భూమిపై ఎక్కువ కాలం పాటు జీవించగలడు. గ్లోబల్ వార్మింగ్ అధికంగా మారితే మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎన్నో జీవజాతులు ఇలా పర్యావరణంలోని మార్పులను తట్టుకోలేక పూర్తిగా నాశనం అయిపోయాయి. మనిషి ఆ జీవజాతుల జాబితాలోకి చేరకుండా ఉండాలంటే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం