TTE Pees On Woman: మద్యం మత్తులో రైళ్లో మహిళపై మూత్రం పోసిన టీటీఈ
TTE Pees On Woman: కొన్ని నెలల క్రితం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలిపై శంకర్ అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన మరచిపోకముందే, అలాంటిదే మరో ఘటన అమృత్ సర్ - కోల్ కతా రైళ్లో జరిగింది.
TTE Pees On Woman: మద్యం మత్తులో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) రైళ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికరాలిపై మూత్రం పోసిన ఘటన అమృత్ సర్ - కోల్ కతా రైళ్లో జరిగింది.

TTE Pees On Woman: ముఖంపై మూత్ర విసర్జన
అమృతసర్ కు చెందిన రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి అమృతసర్ నుంచి కోల్ కతా కు అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్ (Akal Takht Express)లో వెళ్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న ఏ1 కోచ్ లోకి మద్యం మత్తులో వచ్చిన మున్నా కుమార్ అనే టీటీఈ (TTE) బెర్త్ పై నిద్ర పోతున్న రాజేశ్ కుమార్ భార్య ముఖంపై మూత్ర విసర్జన (TTE Pees On Woman) చేశాడు. ఆమె అరుపులకు నిద్ర లేచిన ఆమె భర్త రాజేశ్ కుమార్, ఇతర ప్రయాణీకులు మద్య మత్తులో ఉన్న టీటీఈ మున్నాకుమార్ ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అనంతరం రైలు లక్నోలోని చార్ బాఘ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న తరువాత అతడిని రైల్వే పోలీసుల (GRP)కు అప్పగించారు. రైల్వేలో టీటీఈ గా పని చేస్తున్న మున్నా కుమార్ ది బిహార్ అని రైల్వే పోలీసులు తెలిపారు. ఆ టీటీఈ (TTE) మున్నా కుమార్ ను అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ కస్టడీకి పంపించామని తెలిపారు.
Air India flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో..
సుమారు రెండు నెలల క్రితం ఎయిర్ ఇండియా (Air India) ఫ్లైట్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో శంకర్ అనే ఉన్నతోద్యోగి మద్యం మత్తులో సహ ప్రయాణికరాలైన ఒక వృద్ధురాలపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరకు శంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.