Delhi youth brutal accident: ‘‘ఆ రాత్రి అంజలి ఆల్కహాల్ తాగలేదు’’
Delhi youth brutal accident: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది.
Delhi youth brutal accident: ఆల్కహాల్ తీసుకుంది..
ఆ ప్రమాద సమయంలో బాధిత యువతి అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉంది. సీసీ టీవీ ఫుటేజ్ లో ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ తరువాత ఆమెను విచారించారు. విచారణలో ఆమె పోలీసులకు పలు విషయాలను వెల్లడించింది. యాక్సిడెంట్ తరువాత భయం వేసిందని, అందుకే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయానని ఆమె తెలిపారు. ప్రమాదం జరగినప్పుడు అంజలి డ్రైవింగ్ చేస్తోందని, తాను వెనుక కూర్చున్నానని వెల్లడించింది. ప్రమాదం సమయంలో తను రోడ్డుకు ఒకవైపు పడిపోతే, అంజలి రోడ్డుకు మరోవైపు, ఢీ కొట్టిన కారు చక్రాల కింద పడిపోయిందని వివరించింది. ‘పార్టీలో అంజలి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంది. బయటకు వచ్చిన తరువాత తానే డ్రైవ్ చేస్తానని పట్టుబట్టింది. ఎంత వారించినా వినలేదు’ అని వెల్లడించింది.
Delhi youth brutal accident: డ్రైవర్ కు తెలుసు..
ప్రమాదం జరిగిన తరువాత, కారు చక్రాల కింద యువతి ఇరుక్కుపోయిందన్న విషయం కారు డ్రైవర్ కు, కారులోని ఇతరులకు తెలుసని నిధి వివరించింది. అయినా, వారు నిర్దాక్షిణ్యంగా కారుతో పాటు అంజలి శరీరాన్ని లాక్కు వెళ్లారని తెలిపింది. ప్రమాద సమయంలో కారులో మ్యూజిక్ ప్లేయర్ ఆన్ లో లేదని వెల్లడించింది.
Delhi youth brutal accident: ఆల్కహాల్ తీసుకోలేదు
అయితే, అంజలిపై నిధి చేసిన ఆరోపణలపై అంజలి కుటుంబ వైద్యుడు స్పందించారు. అటాప్సీ రిపోర్ట్ లో అంజలి ఆల్కహాల్ తీసుకున్నట్లు లేదని, ఆమె కడుపులో ఆహారానికి సంబంధించిన ఆనవాళ్లే ఉన్నాయని ఆ రిపోర్ట్ లో స్పష్టంగా ఉందని ఆ డాక్టర్ వివరించారు. అనవసరంగా, బాధిత అమ్మాయి ఇమేజ్ ను దెబ్బతీసే అబద్ధపు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు. ‘‘ఇది చాలా దారుణమైన హత్య. సాడిస్టిక్ మర్డర్. చనిపోవడానికి ముందు ఆమె దారుణంగా చిత్రహింసలకు గురైంది. ఆమె శరీరంపై 40 గాయాలున్నాయి. పక్కటెముకలు విరిగి శరీరం బయటకు వచ్చాయి. ఇంత దారుణంగా హత్య చేసిన దోషులకు కఠిన శిక్ష పడాలి’’ అని ఆ డాక్టర్ వ్యాఖ్యానించారు.