Car Drags Woman: దారుణం: యువతిని 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు.. ఏం జరిగిందంటే!-delhi woman dies after car drags her for kilometers shocking incident on new year day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Car Drags Woman: దారుణం: యువతిని 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు.. ఏం జరిగిందంటే!

Car Drags Woman: దారుణం: యువతిని 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు.. ఏం జరిగిందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 01, 2023 08:04 PM IST

Car Drags Woman for Kilometers in Delhi: ఢిల్లీలో విషాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న యువతిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత సుమారు 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందారు. పూర్తి వివరాలు ఇవే..

Car Drags Woman: దారుణం: యువతిని 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు.. ఏం జరిగిందంటే!
Car Drags Woman: దారుణం: యువతిని 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు.. ఏం జరిగిందంటే!

Car Drags Woman for Kilometers in Delhi: నూతన సంవత్సర వేళ (New Year) దేశ రాజధాని ఢిల్లీలో మనసు కలిచివేసేలా ఓ ఘటన జరిగింది. స్కూటీపై వెళుతున్న యువతిని ఢీకొన్న కారు.. ఆమెను సుమారు 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ 20 ఏళ్ల యువతి మృతి చెందారు. ఆదివారం ఉదయం కంఝావలా (Kanjhawala) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇవే..

ప్రమాదం జరిగిందిలా..

Car Drags Woman for Kilometers in Delhi: సుల్తాన్‍పురి వైపుగా వేగంగా వెళుతున్న ఓ బొలెనో కారు.. యువతి నడుపుతున్న స్కూటీని ఢీకొంది. ఆ తర్వాత కింద పడిన ఆ యువతి కారును కింద పడి చిక్కుకున్నారు. ఆ తర్వాత కిలోమీటర్ల వరకు కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నారు. ఆ యువతి కారు కింద ఉన్నట్టు యువకులకు తెలిసి ఉండకపోవచ్చని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాాగా, సుల్తాన్‍పురి నుంచి కంఝావలా వరకు సుమారు 12 కిలోమీటర్ల పాటు కారు అలాగే ఈడ్చుకెళ్లటంతో ఆ యువతి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మహిళను కారు లాక్కెళుతున్న దృశ్యాన్ని చూసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారు నంబర్‌ను కూడా పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వివస్త్రగా ఉన్న ఓ మహిళ మృతదేహం కంఝావలాలో ఉందని పోలీసులకు మరో కాల్ వచ్చింది. ఆ తర్వాత మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

నిందితుల అరెస్ట్

రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కారులో ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీని తమ కారు ఢీకొట్టినట్టు తెలునని, అయితే ఆమె కారుతో ఆమె ఈడ్చుకొని వస్తున్నారని గుర్తించలేదని వారు చెప్పారని పోలీసులు వెల్లడించారు. కాగా, ఆ యువతికి వీరికి మధ్య ఇదివరకే ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణం కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “వివస్త్రగా ఉన్న ఓ యువతి మృతదేహం ఢిల్లీలోని కంఝావలా ప్రాంతంలో దొరికింది. ఆమె స్కూటర్‌ను కొందరు యువకులు ఢీకొని.. కారుతో పాటు కొన్ని కిలోమీటర్లు లాక్కెళ్లారని తెలిసింది. ఇది చాలా ప్రమాదకమైన విషయం. ఢిల్లీ పోలీసులకు నేను ఇప్పుడు సమన్లు జారీ చేస్తున్నాను. మొత్తం నిజం బయటికి రావాలి” అని ఆమె ట్వీట్ చేశారు.

IPL_Entry_Point